Kohli, Pujara remain steady in ICC Test rankings ఐసీపీ టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో స్టీవ్ స్మిత్

Virat kohli cheteshwar pujara remain steady in icc test rankings

icc, icc test ranking,virat kohli,cheteshwar pujara, test ranking,cricket,indian test ranking,india,icc indian test ranking,icc,virat kohli,cheteshwar pujara,indian kohli,kohli,pujara,indian kohli, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

India skipper Virat Kohli and Test specialist Cheteshwar Pujara held on to their second and seventh position respectively in the latest ICC Test Player Rankings released today. The 29-year-old Kohli had a total of 912 points, 17 points behind Australia's Steve Smith

ఐసీపీ టెస్టు ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో స్మిత్, తరువాత కోహ్లీ

Posted: 04/04/2018 06:08 PM IST
Virat kohli cheteshwar pujara remain steady in icc test rankings

ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్‌ స్మిత్ బ్యాల్ ట్యాపరింగ్ కేసులో ఏడాది నిషేధాన్ని ఎదుర్కొంటూ.. తన శిక్షాకాలన్ని తగ్గించాలని కూడా తాను క్రికెట్ అస్ట్రేలియాను కోరనని.. మీడియ ముఖంగా తాను చేసిన తప్పుకు క్షతంవ్యుడనని ఏడ్చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలో వీరికి విధించిన శిక్షను తగ్గించాలన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. స్మీత్ ను దేశం పరువు తీశావన్న వాళ్లే.. ఇప్పుడు అయ్యో అంటూ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఐసీసీ ర్యాంకుల జాబితాలో స్మిత్ నెంబర్ వన్ స్థానాన్ని అక్రమించాడు.

ఐసీసీ ప్రకటించిన టెస్టు బ్యాట్స్ మెన్‌ ర్యాంకింగ్స్ లో స్టీవ్‌ స్మిత్ (929 పాయింట్లతో) అగ్రస్థానంలో నిలిచాడు. స్మిత్.. కన్నా కేవలం 17 పాయింట్లు మాత్రమే వెనకబడి వున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెంబర్ టు స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆయన 912 పాయింట్లతో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (867), నాలుగో స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ (847) నిలిచారు. ఇక నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్‌ (820 పాయింట్లతో) ఐదో స్థానం దక్కించుకున్నాడు.
 
ఇక టీమిండియా టెస్టు ఓపెనర్ ఛత్తీశ్వర్ పూజరా కూడా టాప్ టెన్ లో స్థానం దక్కించుకున్నాడు. గతంలో ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఏడవస్థానం దక్కించుకున్న పూజారా.. మళ్లీ అదే స్థానంలో కొనసాగుతూ దానిని నిలదొక్కుకున్నాడు. కాగా, ఐసీసీ టెస్టు బౌలర్లలో దక్షిణాఫ్రికా పేసర్ కాగిసో రబాడ (897 పాయింట్లతో) అగ్రస్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ (891), మూడో స్థానంలో సౌతాఫ్రికా బౌలర్ ఫిలాండర్ (845), నాలుగో స్థానంలో భారత బౌలర్ రవీంద్ర జడేజా (844), ఐదో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ (803) ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc  test ranking  virat kohli  cheteshwar pujara  steve smith  cricket  

Other Articles