England's James Anderson sets new record ఘనతను సృష్టించిన అండర్ సన్.. వాల్ష్ ను దాటిన తొలి సీమర్..

James anderson surpasses courtney walsh to become most over worked pacer

James Anderson, milestone. Anderson record, Muttiah Muralitharan, England vs New Zeland, West Indies Test skipper Courtney Walsh, Shane Warne, Anil Kumble, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

England quick James Anderson became the most over-worked seam bowler in Test cricket history when he fired down his 30,020th delivery. Anderson is now fourth on the list of players to have bowled the most deliveries in Test cricket with the top three all spinners, headed by Sri Lanka's Muttiah Muralitharan.

ఘనతను సృష్టించిన అండర్సన్.. వాల్ష్ ను దాటిన తొలి సీమర్..

Posted: 04/04/2018 05:14 PM IST
James anderson surpasses courtney walsh to become most over worked pacer

ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనతను సాధించాడు. విండీస్ గ్రేట్ కోట్నీ వాల్ష్ పేరున వున్న ప్రపంచ రికార్డును చెరిపేసి తన పేరున సరికొత్త రికార్డును సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో తన పేరు నిలిచిపోయేలా రికార్డును సొంతం చేసుకున్నాడు. క్రైస్ట్ చర్చ్ లో న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో 5 వికెట్లు పడగొట్టిన అండర్సన్ టెస్టుల్లో అత్యధిక బంతులు విసిరిన సీమ్ బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు విండీస్ గ్రేట్ కోట్నీ వాల్ష్ పేరుపై ఉంది. వాల్స్ మొత్తం 30,019 బంతులు వేయగా, అండర్స్ 30,020 బంతులు వేసి వాల్ష్‌ను అధిగమించాడు.

వాల్ష్ తన కెరియర్‌లో 519 వికెట్లు తీయగా, అండర్స్ ఇప్పటి వరకు 531 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక బంతులు వేసిన బౌలర్లలో ఓవరాల్‌గా అండర్సన్ నాలుగో వాడు. మిగతా ముగ్గురూ స్మిన్నర్లే కావడం గమనార్హం. శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ మొత్తం 44,039 బంతులు విసిరి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 40,850 బంతులతో రెండో స్థానంలో కొనసాగుతుండగా, 40,705 బంతులతో ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ మూడో స్థానంలో ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles