proteas skipper Blames Batsmen For Defeat వాటిని నిలబెట్టుకోలేకపోవడమే ఓటమి కారణం

Faf du plessis rues lack of partnerships for durban defeat

Cricket,Durban,Durban ODI, Faf, Faf du Plessis, Faf Du Plessis century, India Vs South Africa, India vs South Africa first ODI, India's tour of South Africa, Kingsmead, ODI Cricket, South Africa captain, South Africa vs India 2018, Virat Kohli, Sports news, latest news, sports, cricket news, cricket

South Africa captain Faf du Plessis praised the Indian bowling, he slammed his batting for putting up a dismal show and failing to do the most 'basic' thing of putting together partnerships

వాటిని నిలబెట్టుకోలేకపోవడమే ఓటమి కారణం

Posted: 02/02/2018 06:35 PM IST
Faf du plessis rues lack of partnerships for durban defeat

పర్యాటక జట్టు టీమిండియాతో డర్బన్ లో జరిగిన తొలి వన్డేలో తమ జట్టు వైఫల్యాలపై స్పందించిన కెప్టెన్ డూప్లిసిస్.. ఓటమికి ప్రధానకారణం భాగస్వామ్యాలు నెలకొల్పకపోవడమేనని అన్నారు. అప్రతిహాతంగా 17 విజయాలతో దూసుకుపోతున్న సఫారీలు.. విరాట్ సేన విశ్వరూపం ముందు చిన్నబోయారు. అయితే తమ స్కోరు 300 పైగా వుండివుంటే అటతీరులో మార్పు వచ్చేదని అన్నాడు. భారత స్పిన్నర్లకు అభినందించాడు.

ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం మాట్లాడిన డూప్లిసిస్.. తమ జట్టు సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడం, పార్టనర్ షిప్ లు నెలకొల్పకపోవడం వల్లే ఓడిపోయామని అన్నారు. వన్డేల్లో విజయం సాధించాలంటే భాగస్వామ్యాలు ముఖ్యభూమిక పోషిస్తాయని అన్నారు. దానికి తోడు భారత స్పిన్నర్లు బాగా బౌలింగ్‌ చేశారని కితాబిచ్చాడు. తమ జట్టు 300 పరుగుల స్కోరు చేసివుంటే పరిస్థితి మరోలా వుండేదని అభిప్రాయపడ్డాడు.

కింగ్స్ మీడ్ పిచ్ పై 269 పరుగులు నమోదు చేయడం సరిపోలేదని అన్నాడు. ఈ మైదానంలో అడిన గత రెండు మ్యాచుల్లో తామే విజయం సాధించాం. ఆస్ట్రేలియాపై 370 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాం. మధ్యలో అనవసరంగా వికెట్లు పోగొట్టుకున్నాం. మరో 60, 70 పరుగులు చేసి ఉంటే ఫలితం మాకు అనుకూలంగా ఉండేదని డుప్లెసిస్‌ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Faf du Plessis  India Vs South Africa  Kingsmead  Durban  ODI Cricket  Virat Kohli  cricket  

Other Articles