Babar Azam slams 26-ball ton 26 బంతుల్లో సెంచరీ బాదిన క్రికెటర్..

Babar azam slams 26 ball ton after being hit for six sixes in an over

Shahid Afridi charitable trust, shahid afridi trust T10 Cricket League, Babar Azam, 26-ball hundred, Shoaib Malik, six sixes, Shahid Afridi Foundation cricket, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Shoaib Malik smashed Azam for six sixes in the seventh over of the first innings. Azam though had his revenge as he blasted a hundred off just 26 balls.

26 బంతుల్లో సెంచరీ బాదిన పాకిస్తాన్ క్రికెటర్..

Posted: 12/26/2017 06:01 PM IST
Babar azam slams 26 ball ton after being hit for six sixes in an over

ఇప్పటికే టీ20 క్రికెట్ ఫార్మెట్ పట్ల అభిమానులు అధిక అసక్తిని కనబరుస్తున్న క్రమంలో మాజీ అటగాళ్లు, విశ్లేషకులు మాత్రం దీనిని తూర్పారబడుతున్నారు. క్రికెటర్ సహనానికి, షాట్ సెలక్షన్ కు అద్దంపట్టేది మాత్రం కేవలం టెస్టు క్రికెట్ అనే వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీ20 కంటే కూడా పోట్టి ఫార్మెట్ క్రికెట్ రంగ ప్రవేశం చేయడంతో అభిమానుల దృష్టి దానిపైకి కూబా మళ్లింది.. అదే టీ10 క్రికెట్‌.  ఇటీవలే సెహ్వాగ్‌, అఫ్రిదీ, బ్రావో వంటి మాజీ క్రికెటర్లు ఈ మధ్యనే దుబాయ్ లో టీ10 క్రికెట్‌ ఆడగా. అఫ్రిదీ హ్యాట్రిక్ కూడా సాధించాడు.

ఇక ఆ టీ10 క్రికెట్ లీగ్ ముగియగానే.. షాహిద్ అఫ్రిదీ తన స్వచ్ఛంద సంస్థ తరఫున ఫైసలాబాదులో ధార్మిక మ్యాచ్ నిర్వహించాడు. ఇందులో ఎస్ఏఎఫ్ రెడ్‌, ఎస్ఏఎఫ్ గ్రీన్ జట్లు తలపడ్డాయి. పాకిస్థాన్ జాతీయ క్రికెటర్లు కూడా ఈ క్రికెట్ టోర్నమెంటులో భాగం పంచుకున్నారు. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఏఎఫ్ రెడ్ జట్టులో వున్న సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్.., బాబర్ అజామ్ బౌలింగ్ లోని ఒవర్లో ఏకంగా అరు బంతులకు అరు సిక్సులు కొట్టి.. తన సత్తాను చాటాడు.

దీంతో తరువాత బ్యాటింగ్ కు దిగిన బాబర్ అజామ్ తన బ్యాటుతో గ్రీన్ జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 26 బంతుల్లోనే శతకాన్ని నమోదు చేసి సంచలనం రికార్డును సొంతం చేసుకున్నాడు. కేవలం సిక్సులు, ఫోర్లతోనే తన వంద పరుగులను సొంతం చేసుకున్నాడు. తొలుత రెడ్‌ జట్టు బ్యాట్స్ మెన్ షోయబ్ మాలిక్ 20 బంతుల్లో 84, ఫకర్‌ జమాన్‌ 23 బంతుల్లో 76 పరుగులతో పది ఓవర్లలో రెడ్ జట్టు వికెట్ నష్టానికి 201/1 స్కోరును సాధించింది.

తరువాత బ్యాటింగ్ చేసిన ఎస్ఏఎఫ్ గ్రీన్ జట్టు సభ్యుడు బాబర్‌ ఆజామ్‌ బంతితో విఫలం కావడంతో ఏకంగా తన బ్యాటుతో పరుగుల వరద సృష్టించాడు. 11 భారీ సిక్సర్లు, 7 ఫోర్లు కొట్టాడు. నమ్మశక్యం కాని రీతిలో 384.62 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్‌ చేశాడు. అయితే అతడి ఇన్నింగ్స్ లో రెండు డాట్‌ బాల్స్‌ ఉండటం విశేషం. బాబర్‌ బ్యాటింగ్ తో కష్టమనుకున్న లక్ష్యఛేదన సులభంగా మారిపోయింది. అంతకుముందు ఇండోర్ లో శ్రీలంకతో జరిగిన టీ20లో రోహిత్ శర్మ 35 బంతుల్లోనే శతకం చేసిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shoaib mallik  babar azam  T10 Match  shahid afridi  charitable trust  cricket  

Other Articles