bhuvi defends ms dhoni after rajkot loss ఎనీ డౌట్స్.. ఎంఎస్ ధోని ఈజ్ లెజెండ్ బాస్..!

Bhuvneshwar kumar defends dhoni as legend in indian cricket team

Cricket, ODI, India v/s New Zealand, Bhuvneshwar Kumar, colin munro, Ind vs NZ, Kane Williamson, MS Dhoni, Sanjay Bangar, virat kohli Tom Latham, Ross Taylor, Kedar Jadhav, Kuldeep Yadav, Yuzvendra Chahal, Hardik Pandya, sports news,sports, latest sports news, cricket news, cricket

Terming Mahendra Singh Dhoni a ‘legend’, India's death overs specialist Bhuvneshwar Kumar on Monday brushed aside questions on the role of the former skipper in the T20 format.

ఎనీ డౌట్స్.. ఎంఎస్ ధోని ఈజ్ లెజెండ్ బాస్..!

Posted: 11/07/2017 05:10 PM IST
Bhuvneshwar kumar defends dhoni as legend in indian cricket team

రాజ్ కోట్ టీ20లో తమ జట్టు ఓటమికి ప్రత్యర్థి జట్టు సమైక్యంగా అన్ని విభాగాల్లో రాణించడమే కారణమని టీమిండియా బౌలర్‌ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. కాగా, కొందరు సీనియర్లు విమర్శలు గుప్పిస్తున్నట్లుగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ ఓటమికి బాద్యుడా అని మీడియా ప్రశ్నించగానే ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న లెజెండ్ ఆటగాడు ధోనీ అని భువి వ్యాఖ్యానించాడు.

అనుభవజ్ఞుడైన ఎంఎస్ దోని జట్టులో వుండగా, అత్యంత కీలక సమయంలో కూడా ఆయన అనుకున్నంతగా రాణించలేకపోవడం.. తన సామర్థానికి తగ్గట్టుగా అతను రాణించలేకపోవడం వల్లనే టీమిండియా రాజ్ కోట్ టీ20లో ఓటమి పాలైందని టీమిండియా వెటరన్ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్ లు వాఖ్యనించారు. దీంతో ధోనిని వెనకేసుకోచ్చాడు భువనేశ్వర్ కుమార్. దోని సామర్థ్యంపై జట్టులోని సభ్యులకు ఎలాంటి సందేహాలు లేవని.. సీనియర్ల వాదనల్లో సత్తాలేదని ఆ విమర్శలను కొట్టిపారేశాడు.

ధోనీ పాత్రపై జట్టులో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు.. అతని సామర్థ్యం ఎంటన్నది అతని రికార్డులే చెబుతున్నాయని చెప్పాడు. టీమిండియా ఒక జట్టుగా అందులోని సభ్యులమైన తమకే ఎలాంటి సందేహాలకు అస్కారం లేనప్పుడు.. వెటరన్ల ప్రశ్నలకు అస్కారమేదని ప్రశ్నించాడు. ‘‘ధోని రికార్డులు చూడండి. ఆయన లెజెండ్‌. దేశం కోసం ఎంతో చేశాడు. కాబట్టి ఆయన మీద జట్టులోకి ఎవరికీ ఏ సందేహాలు లేవు’’ అని భువీ తేల్చిచెప్పాడు. ఇక ఐదవ స్పెషలిస్ట్‌ బౌలర్‌ లేకపోవడమే కారణమా? అన్న ప్రశ్నను కూడా ఆయన సున్నితంగా తిరస్కరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs New Zealand  Bhuvneshwar Kumar  colin munro  MS Dhoni  Sanjay Bangar  virat kohli  cricket  

Other Articles