Kohli moves back to top position in ODI rankings ఐసీసీ టాప్ ర్యాంకులో కోహ్లీ.. ఇటు మిథాలీ రాజ్..

Kohli claims back icc top spot surpasses tendulkar s points

Virat Kohli, Virat Kohli ranking, Virat Kohli odi ranking, Virat Kohli in ICC ODI ranking, Virat Kohli in ICC ranking, Virat Kohli score, Virat Kohli in New Zealand match, Mithali Raj, Mithali Raj ranking, Mithali Raj odi ranking, Mithali Raj in ICC odi ranking, Mithali Raj score, Mithali Raj in ICC women's ranking, Mithali Raj in women's world cup, Mithali Raj captain, Indian women's cricket, women's cricket team, india women's cricket, cricket news, sachin tendulkar, kholi, sachin tendulkar record, India vs New Zealand, ICC Women’s World Cup, Rohit Sharma, Mahendra Singh Dhoni

Indian cricket team skipper Virat Kohli has returned to the top of the ICC rankings for batsmen in One Day International (ODI) cricket after smashing his 32nd ODI century on Sunday against New Zealand.

ఐసీసీ టాప్ ర్యాంకులో కోహ్లీ.. ఇటు మిథాలీ రాజ్..

Posted: 10/30/2017 08:55 PM IST
Kohli claims back icc top spot surpasses tendulkar s points

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మరోమారు తన నంబర్‌ వన్‌ స్థానాన్ని తిరిగి దక్కించుకున్నాడు. తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ప్రకారం సౌతాఫ్రికా క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ను వెనక్కినెట్టి కోహ్లీ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కివీస్ తో జరిగిన వన్డే సిరీస్ ను భారత్‌ 2-1తో దక్కించుకోవడం.. మూడు వన్డేలలో రెండు శతకాలతో  మొత్తం 263 పరుగులు చేసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డును సొంతం చేసుకోవడంతో ఆయనకు తిరిగి తన అగ్రస్థానం దక్కింది. భారత బౌలర్‌ బుమ్రా కూడా తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకును సాధించాడు.

బ్యాట్స్ మెన్‌ ర్యాంకింగ్స్ లో కోహ్లీ(889) తన కెరీర్‌లోనే అత్యుత్తమ పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న కోహ్లీ మరోవైపు టీమిండియా తరపున అత్యధిక పాయింట్లు సచిన్ టెండుల్కర్ పాయింట్లను అధిగమించాడు. ఈ ఫీటు సచిన్ 1998లో సాధించాడు. ఇక కోహ్లీ తరువాతి స్థానాల్లో.. డివిలియర్స్‌(872), డేవిడ్‌ వార్నర్‌(865) లు వున్నారు.

బౌలర్ల జాబితాలో బుమ్రా మూడు స్థానాలు ఎగబాకి తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా మూడో ర్యాంకును సొంతం చేసుకున్నాడు. అక్షర్ పటేల్‌(8), భువనేశ్వర్ కుమార్‌(15) మాత్రమే టాప్ 20లో చోటు దక్కించుకున్నారు. జట్టు ర్యాంకింగ్స్‌లో మాత్రం టీమిండియా రెండో స్థానంలో కొనసాగుతుండగా, సౌతాఫ్రికా అగ్రస్థానంలో వుంది.

ఇక ఐసీసీ వన్డే బ్యాట్స్ వుమన్ ర్యాంకింగ్స్ లో టీమిండియా మహిళల క్రికెట్‌ జట్టు సారథి మిథాలీరాజ్‌ అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానం నుంచి నంబర్‌ వన్ కు చేరుకుంది. ఆమె ఖాతాలో 753 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ప్రపంచకప్‌ తర్వాత ఆమె ఒక్క మ్యాచ్‌ సైతం ఆడకపోవడం విశేషం. ఆస్ట్రేలియా బ్యాట్స్ వుమన్ ఎలీస్ పెర్రీ (725), దక్షిణాఫ్రికా అమ్మాయి అమీ శాటర్త్ వైట్ (720) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బౌలర్ల జాబితాలో టీమిండియా సీనియర్‌ బౌలర్‌ జులన్‌ గోస్వామి రెండో స్థానంలో నిలువగా, దక్షిణాఫ్రికా బౌలర్‌ మారిజానె క్యాప్‌ (656) అగ్రస్థానంలో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  ICC  ODI ranking  Mithali Raj  sachin tendulkar  Rohit Sharma  MS Dhoni  Jasprit Bumrah  cricket  

Other Articles