Rohit Sharma hails Bumrah, Bhuvneshwar winమళ్లీ వాళ్లిద్దరే గెలిపించారు.. శతకవీరుడు రోహిత్

Rohit sharma hails jasprit bumrah bhuvneshwar kumar for odi series win

Cricket, ODI, India v/s New Zealand, Ind vs NZL, New Zealand, India vs New Zealand 2017, Rohit sharma, kanpur, Virat Kohli, bumrah, bhuvaneshwar, death bowlers, cricket, Kedar Jadhav, Kuldeep Yadav, Yuzvendra Chahal, Hardik Pandya, sports news,sports, latest sports news, cricket news, cricket

Rohit Sharma hails Jasprit Bumrah, Bhuvneshwar Kumar for wining ODI even after slamming 147 off 138 against New Zealand in the final ODI at Kanpur

మళ్లీ వాళ్లిద్దరే గెలిపించారు.. శతకవీరుడు రోహిత్

Posted: 10/30/2017 06:50 PM IST
Rohit sharma hails jasprit bumrah bhuvneshwar kumar for odi series win

న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ గెలుచుకోవడంలో మాత్రం వాళ్లిద్దరి పాత్ర ప్రముఖంగా వుందని టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ అన్నారు. కాన్పూర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 147 పరుగులు చేసిన రోహిత్.. అయితే మ్యాచ్ తుదికంతా.. అత్యంత ఉత్కంఠగా మారిన క్రమంలో.. టీమిండియా గెలుపులో మాత్రం ఇద్దరి ప్రాతే అధికంగా వుందని రోహిత్ అన్నాడు. వారిద్దరే ప్రస్తుతం ప్రపంచ డెత్ ఓవర్ స్పెషలిస్టులుగా పేరొందిన భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బూమ్రాలుగా పేర్కొన్నాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత 337 పరుగుల విజయలక్ష్యాన్ని కివీస్ ముందు పెట్టినా.. ఏ మాత్రం తడముకోకుండా పోటాపోటీగా పరుగులు చేసిన కివీస్ లక్ష్య ఛేదనలో ఆద్యంతం ఆకట్టుకుంది. తుది ఓవర్ వరకు అత్యంత ఉత్కంఠకరంగా సాగిన పోరులో కివీస్ 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరి నాలుగు ఓవర్లలో విజయానికి 35 పరుగుల దూరంలో నిలిచిన కివీస్ ను కట్టడి చేసి భారత్ కు విజయాన్ని అందించింది భువి, బూమ్రాలేనని అన్నాడు.

వీరిద్దరూ అత్యుత్తమ డెత్ బౌలర్లు అనడంలో ఎటువంటి సందేహం లేదని.. కివీస్ తో మూడో వన్డేలో మరోసారి దాన్ని వారు రుజువు చేసుకున్నారని అన్నాడు. ‘నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఈ వికెట్ పై ఏమాత్రం కష్టం కాదు. మరొకవైపు న్యూజిలాండ్ కూడా మంచి దూకుడుగా ఆడుతుంది. ఆ తరుణంలో మ్యాచ్ ను బూమ్రా, భువనేశ్వర్ లు నిలబెట్టారు. కివీస్ ను కట్టడి చేసి మళ్లీ గేమ్ ను మావైపుకి తీసుకొచ్చారు'  అని రోహిత్ శర్మ విశ్లేషించాడు. చివరి 4 ఓవర్లలో వీరిద్దరూ 28 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించడంతో భారత్ ఆరు పరుగుల తేడాతో మ్యాచ్ ను నిలబెట్టుకున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs New Zealand 2017  kanpur  Virat Kohli  Rohit sharma  bumrah  bhuvaneshwar  death bowlers  cricket  

Other Articles