MS Dhoni 1st keeper to complete 200 catches in India వికెట్ల వెనుక..ధోని డబుల్ సెంచరీ

Ms dhoni 1st indian keeper to complete 200 catches in india

India v New Zealand 2nd ODI, MS Dhoni, MS Dhoni records, MS Dhoni average, MS Dhoni not out, Adam Gilchrist, 200 international catches in India, Virat Kohli, Virat Kohli average, Virat Kohli records, Bhuvneshwar Kumar, Jasprit Bumrah, Rohit Sharma, india beat new zealand, india win by 6 wickets, pune pitch, pitch curator, indian cricket team, team india, cricket news, Green Park Stadium, Kanpur, Shikhar Dhawan, Rohit Sharma, Kum, Alec stewart, Sangakkara, cricket

Mahendra Singh Dhoni who is lightening behind the stumps created a unique record in the Pune match. He became the first Indian keeper to complete 200 ODI catches on Indian soil, which is a big achievement.

వికెట్ల వెనుక..ధోని డబుల్ సెంచరీ.. ఇది కూడా రికార్డే మరీ..

Posted: 10/26/2017 09:39 PM IST
Ms dhoni 1st indian keeper to complete 200 catches in india

భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ అరుదైన ఘనతను అందుకున్నాడు. నిత్యం వికెట్ల వెనకవుండి బౌలర్ల చేత తనకు కావాల్సిన విధంగా బౌలింగ్ చేయించుకుని ప్రత్యర్థుల వెన్ను విరచడంలో కీలకపాత్రం పోషించే ఈ మాజీ సారధి తాజాగా వికెట్ల వెనుక రెండు వందలు పూర్తి చేశాడు. అదేంటి వికెట్ల వెనుక రెండు వందలు అంటారా..? వికెట్ల వెనుక రెండు వందల క్యాచులను పూర్తి చేసి.. తోలి భారత కీపర్ గా రికార్డును సృష్టించాడు.

స్వదేశంలో మాత్రమే రెండు వందల క్యాచులను పట్టిన ఏకైక కీపర్ గా ధోని ఈ రికార్డును అందుకున్నాడు. భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య పుణెలో బుధవారం రెండో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో మూడో ఓవర్లో భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో కివీస్‌ ఓపెనర్‌ గప్తిల్‌ వికెట్‌ కీపర్‌ ధోనీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్యాచ్‌తో సొంతగడ్డపై 200 క్యాచ్‌లను పట్టిన తొలి భారత వికెట్‌ కీపర్‌గా ధోనీ రికార్డు సృష్టించాడు.

ఇప్పటి వరకు కుమార సంగక్కర(శ్రీలంక), స్టీవార్ట్‌(ఇంగ్లాండ్‌) మాత్రమే తమ తమ దేశాల్లో 200పైగా క్యాచులను అందుకున్నారు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ధోనీ ఇప్పటి వరకు 288 క్యాచులు పట్టాడు. అడమ్‌ గిల్‌క్రిస్ట్‌(417), మార్క్‌ బౌచర్‌(402), సంగక్కర(383) మాత్రమే వన్డే క్రికెట్‌లో ధోనీ కంటే ముందు ఉన్నారు. న్యూజిలాండ్ తో నిన్న జరిగిన మ్యాచులో భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే ఈ నెల 29న కాన్పూర్‌లో జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India v New Zealand  Pune ODI  MS Dhoni  Record  200 international catches in India  cricket  

Other Articles