Krunal Pandya wishes brother Hardik on his birthday తమ్ముడూ ఈ ప్రశంసలు అరంభం మాత్రమే..

Hardik pandya s birthday 12 cool brother duos in international cricket

cricket score, india vs australia, hardik pandya, birthday, krunal pandya, india vs australia 2017, india vs australia, india vs australia 2nd t20, ind vs aus, ind vs aus odi, india vs australia odi score, india vs australia match, india vs australia cricket score, guwahati t20 match, cricket

On Hardik Pandya 24th birthday, his brother Krunal took to Twitter to wish his younger brother, and did not hold back in displaying his emotions in front of the world.

తమ్ముడూ ఈ ప్రశంసలు అరంభం మాత్రమే: కృనాల్ ఫాండ్యా

Posted: 10/12/2017 10:50 AM IST
Hardik pandya s birthday 12 cool brother duos in international cricket

టీమిండియా క్రికెట్ లో ఇప్పుడు అన్ని విభాగాల్లో రాణిస్తున్న యువ ఆల్ రౌండర్‌ హార్దిక్ పాండ్య.. అన్ని ఫార్మెట్ల క్రికెట్ లో రాణిస్తున్న పాండ్య.. ఇవాళ 24వ పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా అన్ని వర్గాల నుంచి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లివిరుస్తున్నాయి. మరీ ముఖ్యంగా టీమీండియా క్రికెటర్లు, వెటరన్ క్రికెటర్లు, ముంబై ఇండియన్స్ జట్టు నుంచి సామాజిక మాధ్యమాల్లో ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

మరీ ముఖ్యంగా టీమిండియా క్రికెట్ అభిమానులు, హార్థిక్ అభిమానులు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలను వ్యక్తం చేసేందుకు సోషల్ మీడియా ద్వారా పోటీ పడ్డారు. ఇక మరోవైపు హార్థిక్ సోదరుడు కృనాల్ కు హార్దిక్‌ పాండ్య అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఐపీఎల్ లో ఈ అన్నదమ్ములిద్దరూ ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆసీస్ తో టీ20 సిరీస్ కోసం టీమిండియాతో ఉన్న హార్దిక్ కు కృనాల్‌ ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు.

అంతేకాదు తమ్ముడితో తనకున్న అనుబంధాన్ని ఉద్వేగభరితంగా పంచుకున్నాడు. ‘తమ్ముడూ.. నీకో విషయం తెలుసా! నువ్వంటే నాకు పిచ్చి. కొన్ని సార్లు కోపంతో నీ మీద అరిచాను. కానీ నిజం ఏమిటంటే నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వే నాకు స్ఫూర్తి, బలం. నువ్వు సాధిస్తోన్న, అందుకుంటోన్న విజయాల పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నా. ఇది నీకు, మనకు ప్రారంభం మాత్రమే అని నాకు తెలుసు. ఈ సందర్భంగా నీకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా. నీ కోసం ఎల్లప్పుడూ నేను ఉంటాను. ఐ లవ్యూ సో మచ్‌. హ్యాపీ బర్త్ డే మై బ్రో. దేవుని దీవెనలు నీకు ఉంటాయి. నువ్వెప్పుడూ మెరవాలి’ అని కృనాల్‌ పేర్కొన్నాడు. ‘నాకు తెలుసన్నయ్యా. నా భావన కూడా అదే’ అని హార్దిక్‌ బదులిచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  hardik pandya  birthday  krunal pandya  Team India  Australia  T20 match  cricket  

Other Articles