India beat SL by an innings and 171 runs లంకపై పోరులో చరిత్రను సృష్టించిన టీమిండియా

India beat sl by an innings and 171 runs clinch series 3 0

India vs Sri Lanka, Live cricket score, India vs Sri Lanka live score, Ravichandran Ashwin, Hardik Pandya, Shikhar Dhawan, pallekele test, sports news, cricket, news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

Ashwin’s 4/68 and Shami’s 3/32 helped India crush Sri Lanka by an innings and 171 runs on Day 3 of the Pallekele Test. This is the first time that India have whitewashed their opponents away from home in a minimum of three-Test series.

లంకపై పోరులో చరిత్రను సృష్టించిన టీమిండియా

Posted: 08/14/2017 05:14 PM IST
India beat sl by an innings and 171 runs clinch series 3 0

శ్రీలంక పర్యటనలో భారత అతిథ్య జట్టును క్లీన్ స్వీప్ చేసి చరిత్రను తిరగరాసింది. గత 85 ఏళ్ల టీమిండియా క్రికెట్ చరిత్రలో ఎన్నడూ సాధించని వైట్ వాస్ విజయాన్ని అందుకుంది. వీదేశీ పర్యటనలలో ఇప్పటి వరకు టీమిండియా జట్టు సాధించని టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ విజయాలను అందుకున్న జట్టుగా విరాట్ సేన సరికొత్త అద్యయాన్ని లిఖించింది. మూడు టెస్టుల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియా జట్టు..  శ్రీలంకను చివరి రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసింది.

అందుకు ముందు అడిన తొలి టెస్టులో కూడా ఫాలో-అన్ అడించే అవకాశమున్నా.. విరాట్ సేన అందుకు ప్రాధాన్యతను ఇవ్వకుండా సెకెండ్ ఇన్నింగ్స్ ను అడింది. లేని పక్షంలో ఈ సరికోత్త అద్యయం కూడా సరికొత్తగా మూడు టెస్టులలో ఇన్నింగ్స్ విక్టరీగా కోహ్లీ సేన నమోదు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది.  కాగా టెస్టు కెప్టెన్సీ పగ్గాలను అందుకున్న తరువాత వరుసగా ఎనమిదవ టెస్టు సిరీస్ ను కూడా విరాట్ తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్.. బౌలింగ్ సహా గ్రౌండ్ లో కూడా సమష్టిగా రాణించిన టీమిండియా పల్లెకలె వేదికగా జరిగిన మూడవ టెస్టులో ప్రత్యర్థి శ్రీలంకను మూడవ రోజునే చాపచుట్టేలా చేసింది. పల్లెకలే టెస్టులో ఇన్నింగ్స్ 171 పరుగుల విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇదిలావుండగా, ఆతిథ్య శ్రీలంక జట్టు వారి స్వదేశంలోనే వైట్ వాస్ కావడం ఇది రెండవ సారి. కాగా టెస్టు క్రికెట్‌ చరిత్రలో స్వదేశానికి చెందిన జట్టు.. క్లీన్‌స్వీప్ కు గురికావడం ఇది ఏడోసారి. దీంతో టీమిండియా అరుదైన రికార్డులను బద్ధలు కొట్టినట్టైంది. అనుకోకుండా టెస్టు జట్టులో స్థానం సంపాదించిన శిఖర్ ధావన్.. ఈ సిరీస్ లో రెండు శతకాలను నమోదు చేసి.. అత్యధిక పరుగులు సాధించడంతో అతనికి మ్యాన్ అప్ ది సిరీస్ అవార్డును ప్రకటించారు. కాగా మూడవ టెస్టులో అన్ని విభాగాల్లో రాణించిన పాండ్యాకు మ్యాన్ అప్ ది మ్యాచ్ వరించింది.

మూడు టెస్టు సిరీస్ లో రెండు టెస్టులలో గెలిచి.. సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. మూడో టెస్టుతో భారత బౌలర్లు లంకేయులను నిలదోక్కుకోనీయలేదు. పదునైన బౌలింగ్‌తో వణికించారు. స్పిన్‌ తో తికమక పెడుతూనే.. పదునైన పేస్ తో బెంబేలెత్తించారు. దీంతో ఫాలోఆన్ లో ఓవర్‌నైట్‌ స్కోరు 19/1తో మూడో రోజు అటను ప్రారంభించిన లంకేయులు 181 పరుగులకే కుప్పకూలారు. నైట్‌ బ్యాట్స్ మన్ కరుణరత్నె (16)ను అశ్విన్ 26 పరుగుల వద్ద పెవీలియన్ కు పంపగా, పుష్ఫకుమార్‌ (1)ను ఉమేశ్‌, కుశాల్‌ మెండిస్‌ (12)ను షమి వెనువెంటనే వెనక్కు పంపారు. నాలుగు వికెట్లు నష్టంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆ జట్టును సారథి దినేశ్‌ చండిమాల్‌ (36), ఏంజెలో మాథ్యూస్‌ (35) లు కాపాడుకుంటూ 65 పరుగులను జోడించారు.

చండిమాల్ ను ఔట్ చేసి కుల్దీప్ రెండో ఇన్నింగ్స్ లో మరో వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మాథ్యూస్ ను అశ్విన్ ఎల్బీడబ్యూ చేయడంతో లంక పతనం మరింత వేగం పుంజుకొంది. పెరీరా (8), సండకాన్ (8) వెంటవెంటనే ఔట్ కావడం టీమిండియాకు కలిసోచ్చినా.. మ్యాచ్ చివర్లో డిక్వెలా (41) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేయగా, అతడ్ని ఉమేశ్ పెవీలియన్ కు పంపాడు. లహిరు కుమార (10)ని అశ్విన్‌ బోల్తా కొట్టించడంతో లంక కథ ముగిసింది. అశ్విన్‌ (4/68), మహ్మద్‌ షమి (3/32), ఉమేశ్‌ యాదవ్‌ (2/1) కుల్‌దీప్‌ (1/56) బౌలింగ్‌లో రాణించారు. హార్దిక్‌ పాండ్యా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, శిఖర్‌ ధవన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  Virat Kohli  Shikhar Dhawan  Hardik Pandya  pallakele test  Team India  sports  cricket  

Other Articles