Ashwin Gets Trolled with comparision రాంగ్ పంచ్ తో విమర్శలపాలైన అశ్విన్

Ashwin gets trolled for comparing csk ban with manchester united air crash

india,ravichandran ashwin,cricket,manchester united, air crash, ban, csk ban, chennai super kins, indian premier league, IPL, cricket news, sports news, sports, latest news, cricket

Team member Ravichandran Ashwin too made a statement on the Chennai Super Kings comeback which was not taken positively by the social media.

రాంగ్ పంచ్ తో విమర్శలపాలైన అశ్విన్

Posted: 07/20/2017 10:09 PM IST
Ashwin gets trolled for comparing csk ban with manchester united air crash

బీసీసీఐ మాజీ బాస్ గా వ్యవహరించిన శ్రీనివాసన్ కు చెందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండేళ్ల నిషేధాన్ని ముగించుకుని 2018 ఐపీఎల్ లోకి ఆడగేుపెట్టనున్న సందర్భంగా ఆ జట్టుకు అటగాళ్లు, అభిమానులు సామాజిక మాద్యమాల ద్వారా ఘనస్వాగతం పలుకుతున్నారు. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ ‘తలా’ అని రాసి ఉన్న 7వ నెంబరు పసుపు రంగు జెర్సీని ధరించి తన స్టైల్లో చెన్నై సూపర్ కింగ్స్ కి స్వాగతం పలికాడు. తాజాగా రవిచంద్రన్‌ అశ్విన్ చెన్నై జట్టు పునరాగమనం గురించి మాట్లాడారు. అయితే అదేంటో కానీ ఆయన నెట్ జనుల విమర్శలకు గురయ్యాడు.

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పునరాగమనంపై మాట్లాడుతూ... ‘రెండేళ్ల నిషేధాన్ని ముగించుకుని పునరాగమనం చేస్తోన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరింతగా బలోపేతం అయ్యిందని చెప్పాలనుకుని ఓ ఉదాహరణతో విమర్శపాలయ్యాడు. 1958లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో 8 మంది మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఫుట్ బాల్ క్రీడాకారులు సహా 23మంది ప్రయాణికులు మృతి చెందారు. ఆ ప్రమాదం తర్వాత ఆ జట్టు పూర్తిగా కోలుకోవడానికి రెండేళ్లు పట్టిందని.. రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై జట్టు బలంగా తిరిగి వస్తోందని ఉదహరించడం నెట్ జనులకు అగ్రహం తెప్పించింది.

చెన్నై జట్టును ఓ క్లబ్ జట్టుతో పోల్చడం, ఫిక్సింగ్ కారణంగా నిషేధం ఎదుర్కొన్న జట్టును విమాన ప్రమాద ఘటనతో పోల్చడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన అశ్విన్‌ తన ట్విటర్‌ ద్వారా తన ఉద్దేశాన్ని మళ్లీ వివరించాడు. ‘ప్రమాదం కారణంగా మాంచెస్టర్‌ యునైటెడ్‌ జట్టు కీలక ఆటగాళ్లను కోల్పోయినా రెండేళ్ల తర్వాత ఎంతో బలంగా పుంజుకుందని, తాను ఆ బలం గురించి వివరించే క్రమంలోనే ప్రమాదం గురించి ఉదహరించాననని పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : india  ravichandran ashwin  cricket  manchester united  ban  air crash  chennai super kings  IPL  

Other Articles