Rahul Dravid reacts on ramachandra guha allegations బిసిసిఐ నిబంధనలను ఎక్కడా అతిక్రమించలేదు

Rahul dravid reacts on ramachandra guha allegations

Rahul Dravid, Indian Premier League, India A coach, India U-19 coach, Delhi Daredevils Mentor, Ramachandra Guha, BCCI, India U-19 coach, cricket news, sports news, sports, cricket

Yes, I have written to the CoA explaining my position and explaining the background against which this perceived conflict of interest has happened," Dravid

బిసిసిఐ నిబంధనలను ఎక్కడా అతిక్రమించలేదు

Posted: 06/27/2017 02:51 PM IST
Rahul dravid reacts on ramachandra guha allegations

తనపై వచ్చిన విమర్శలపై ఎట్టకేలకు ది వాల్ గా పేరొందిన టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. తాను బిసిసిఐతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు పేర్కోన్న నిబంధనలను అతిక్రమించలేదని ఆయన తేల్చిచెప్పారు. తాను ద్వంద ప్రయోజనాలకు పొందుతున్నానన్న అరోపణలను మిస్టర్ ఢిపెండబుల్ తోసిపుచ్చారు. బిసిసిఐ కమిటీ నుంచి ఇటీవల తప్పుకున్న చరిత్రకారుడు రామచంద్ర గుహ తన పేరును ప్రస్తావిస్తూ, తను జోడు పదవులపై విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఓ వైపు భారత 'ఏ' జట్టుతో పాటు అండర్ 19 జట్లకు కోచ్ గా వ్యవహరిస్తూనే, ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు కోచ్ గా ఎలా పని చేస్తారని ఇటీవల రామచంద్ర గుహ ప్రశ్నించడంపై ద్రావిడ్ స్పందిస్తూ తనను విమర్శించడం బావ్యం కాదని అన్నాడు. తాను బిసిసిఐ నిబంధనలను ఎన్నడూ అతిక్రమించలేదని చెప్పాడు. ఇటీవల తన రాజీనామా లేఖలో కటువైన పదాలను వాడుతూ రామచంద్ర గుహ, ద్రావిడ్ పేరును ప్రస్తావిస్తూ, ద్వంద్వ ప్రయోజనాల అంశాన్ని లేవనెత్తడంతో.. ఈ విషయమై ద్రావిడ్ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు.

బీసీసీఐ నిబంధనలకు అనుగూణంగానే తాను వ్యవహరిస్తున్నానని చెప్పాడు. తనకు బిసిసిఐ కాంట్రాక్టు ఇచ్చిన సమయంలో పెర్కోన్న నిబంధనల ప్రకారమే తాను నడుచుకుంటున్నానని చెప్పాడు. అయితే రామచంద్ర గుహ విమర్శలు నేపథ్యంలో బిసిసిఐ తరువాత నిబంధనలను మార్చిందేమోనని ఆ విషయం తనకు తెలియదని చెప్పుకోచ్చాడు. అయితే తాను ఒక్కడిని మాత్రమే ద్వంద ప్రయోజనాలు పోందుతున్నట్లు రామచంద్ర గుహ చెప్పడం కూడా తప్పని, తన మాదిరిగానే ఐదారుగురు ఆటగాళ్లూ ఇలా జోడు పదవుల నిర్వహణలో వున్నారని అన్నాడు.

జోడు పదవులను అలకరించడం.. ద్వంద ప్రయోజనాలకు పాల్పడుతున్నామంటూ అరోపణలు చేయడానికి ముందు ఈ విషయంలో మరింత స్పష్టత అవసరమని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. కాగా, ఈ వివాదంతో మనస్తాపం చెందిన ద్రావిడ్, బీసీసీఐతో తన కాంట్రాక్టును వదులుకునేందుకు సిద్ధమైనట్టు కూడా వార్తలు వస్తున్నాయి. రామచంద్ర గుహ తన రాజీనామా లేఖలో ధోణికి స్పెషల్ క్యాటగిరి కింద ట్రీట్ చేయడంపై కూడా గతంలో పలు అరోపణలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Dravid  Indian Premier League  BCCI  India U-19 coach  cricket  

Other Articles