Rishabh Pant Finds the Perfect Mentor in MS Dhoni కోచ్ అవతారమెత్తిన మాజీ కెప్టెన్ ధోని..

India vs west indies ms dhoni gives pep talk to rishabh pant

india, west indies, windies, india vs west inides, india vs windies, ind vs wi, wi vs ind, Team India, ms dhoni, rishabh pant, dhoni pant, west indies vs India, ind vs wi, , cricket news, sports news, Team India, cricket

Ahead of India's first ODI match against West Indies on June 23, youngster Rishabh Pant was seen getting some valuable advice from former captain Mahendra Singh Dhoni.

కోచ్ అవతారమెత్తిన మాజీ కెప్టెన్ ధోని..

Posted: 06/23/2017 09:37 PM IST
India vs west indies ms dhoni gives pep talk to rishabh pant

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి.. కోచ్ కుంబ్లేకు మధ్య రేగిన వివాదం.. ఏమిటీ, ఎందుకో తెలియదు కానీ.. అది మాత్రం ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. ఇప్పటికీ అనేక మంది సీనియర్లు కెప్టెన్ విరాట్ కోహ్లీని, ఆయన అహంకార వైఖరిని తూర్పారబడుతున్నారు. అదే సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఏకంగా కోచ్ అవతారం ఎత్తాడు. విరాట్ సేన వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరి వెళ్లగా, ఇవాళ తొలివన్డేలో విండీస్ తో తలపడుతుంది.

అయితే, నిన్న చేసిన ప్రాక్టీసులో ధోనీ కోచ్‌లా కొత్త కుర్రాడికి ట్రైనింగ్ ఇచ్చాడు. వెస్టిండీస్ టూర్ కోసం యువ వికెట్ కీప‌ర్ రిష‌బ్‌ పంత్‌ను సెలెక్ట‌ర్లు ఎంపిక చేశారు. ఆ కొత్త కుర్రాడు ధోనీ త‌ర్వాత ధోనీ అంత‌టి వాడు అవ్వాల‌ని సెలెక్టర్లు కోరుకుంటున్నారు. ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్ లేకుండానే ఆడుతోంది. వికెట్ కీప‌ర్‌గా ధోనీకి ఎంతగానో అనుభ‌వం ఉంది. అందుకే ధోనీ ఆ కొత్త కుర్రాడికి మెల‌కువ‌లు నేర్పించాడు. ధోనీ కోచ్ లా సీరియస్ గా శిక్షణ‌నిస్తుండ‌గా తీసిన ఓ ఫొటోను బీసీసీఐ త‌న ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇటీవ‌ల జ‌రిగిన‌ ఐపీఎల్లో ధోనీలాగే పంత్ రాణించాడు. ఈ ఫొటో అభిమానుల‌ను అల‌రిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india coach  ms dhoni  mentor  rishabh pant  wicket keeper  bcci  cricket  

Other Articles