England knock australia out of icc championship tournament ఛాంపియన్స్ ట్రోఫీలో ‘కంగారె’త్తించనది ఎవరు..?

England knock australia out of icc championship tournament

icc champions trophy 2017. Champions Trophy 2017, England vs Australia, Steve Smith, Eoin Morgan, ICC Champions Trophy, England Cricket Team, Australia Cricket Team, Ben Stokes, Mark Wood, Adil Rashid, cricket

England, already through to the semi-finals of the ICC Champions Trophy, beat Australia by the D/L method courtesy of a Ben Stokes century and Eoin Morgan’s 87.

ఛాంపియన్స్ ట్రోఫీలో ‘కంగారె’త్తించనది ఎవరు..?

Posted: 06/11/2017 12:39 PM IST
England knock australia out of icc championship tournament

వన్డే క్రికెట్ లో రారాజుమని భావించే అస్ట్రేలియా జట్టుపై పగబట్టి మరీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోర్నీ లోంచి బయటకు పంపిందెవరు.? అంటే వరుణుడేనని సమాధానం వస్తుంది. రెండు గ్రూపులలో మరే జట్టుకు ఎదురవ్వని ప్రకృతి పరాభవం అసీస్ జట్టుకు ఎదరైంది. ఫలితంగా ఐసిసీ టార్నోనుంచి వైదొలగింది. ఇం‍గ్లండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో కంగారులు ఓటమిపాలయ్యారు. చావో-రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లోనూ వర్షం వెంటాడటం, ఓటమి తప్పకపోవడంతో ఆ జట్టు తట్టాబుట్టా సర్దుకొని ఇంటిముఖం పట్టింది.

చాంపియన్స్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టును వర్షం దారుణంగా వెంటాడింది. వర్షం కారణంగా ఆ జట్టుకు సంబంధించిన రెండు మ్యాచ్‌లు తుడిచిపెట్టుకుపోయాయి. బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌తో మ్యాచుల్లో గెలిచే స్థితిలో వర్షం రావడంతో ఆసిస్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టయింది. 2009లో చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా..2013, 2017లో జరిగిన ఈ టోర్నమెంటులో ఒక్క మ్యాచ్‌ కూడా గెలువకపోవడం గమనార్హం.

ఇక అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో కివిస్‌కు బంగ్లాదేశ్‌ షాకిచ్చిన సంగతి తెలిసిందే. నాలుగో వికెట్‌కు మహ్మదుల్లా, షకిబ్‌ ఆల్‌ హసన్‌ రికార్డుస్థాయిలో 224 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించడంతో బంగ్లా జట్టు 268 పరుగులు సాధించి కివిస్‌ విసిరిన లక్ష్యాన్ని అలవోకగా అధిగమించింది. దీంతో గ్రూప్‌-ఏ నుంచి వరల్డ్‌ కప్‌ ఫైనలిస్టులను తరిమేసి ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌ జట్లు చాంపియన్స్‌ ట్రోఫీ సెమీఫైనల్‌కు చేరాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc champions trophy  England  Australia  Steve Smith  Eoin Morgan  Ben Stokes  cricket  

Other Articles