Afghanistan storm to 63-run victory అప్ఘనిస్థాన్ కూడా షాకిచ్చింది.. ఎవరికో తెలుసా..?

Rashid khan picks seven wickets as afghanistan storm to 63 run victory

west indies vs afghanistan, wi vs afghanistan, west indies, afghanistan, windies, rashid khan, cricket news, cricket, sports news

Rashid Khan took seven wickets for 18 runs to dismiss West Indies for a total of 149. Afghanistan stormed to a 63-run victory over West Indies in the first of the three-mach ODI series that the two sides are contesting.

అప్ఘనిస్థాన్ కూడా షాకిచ్చింది.. ఎవరికో తెలుసా..?

Posted: 06/10/2017 09:49 PM IST
Rashid khan picks seven wickets as afghanistan storm to 63 run victory

ఇటు ఛాంపియన్స్ ట్రోఫిలో క్రికెట్ జట్టు పటిష్ట జట్లకు చుక్కెలు చూపుతున్న పసికూనలను అదర్శంగా తీసుకున్నదో ఏమో తెలియదు కానీ, అటు ఏకంగా మరో పసికూన కూడా దిగ్గజ క్రికెట్ జట్టుకు కళ్లు బైర్లు కమ్మెలాచేసింది. న్యూజీలాండ్ జట్టుకు బంగ్లాదేశ్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోక ముందే మరో అద్భుతం జరిగిపోయింది. వెస్టిండీస్ క్రికెట్ టీమ్ కు పసికూన ఆఫ్ఘనిస్థాన్ షాక్ ఇచ్చింది. సెయింట్ లూసియాలో జరిగిన తొలి వన్డేలో ఆఫ్ఘనిస్థాన్ 63 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ కు దిగిన విండీస్ జట్టు 44.4 ఓవర్లలో కేవలం 149 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్ఘాన్ బౌలర్ రషీద్ తన స్పిన్ మాయాజాలంతో విండీస్ వెన్ను విరిచాడు. ఆరవ బౌలర్ గా బరిలోకి దిగిన రషీద్ 18 పరుగులు మాత్రమే ఇచ్చి, ఏకంగా 7 వికెట్లు తీశాడు. రషీద్ ను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైన విండీస్ చేతులెత్తేసింది. దీంతో అప్ఘన్ క్రికెట్ లో నూతన అధ్యయం లిఖించబడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : west indies  afghanistan  rashid khan  cricket  

Other Articles