Sehwag dines with Ganguly and Gavaskar టీమిండియా ప్రధాన కోచ్ పదవి వీరేంద్రుడికేనా..?

Virender sehwag dines with sourav ganguly and sunil gavaskar

virender sehwag, india cricket coach, icc champions trophy, anil kumble, bcci, sourav ganguly, sunil gavaskar, ICC Champions Trophy 2017, sachin tendulkar, sourav ganguly, tom moody, virat kohli, vvs laxman, india coach, india coach applicants, cricket news, sports news, Team India, cricket

Former Indian batsman, Virender Sehwag, recently applied for the post of Indian cricket team’s head coach and reportedly stands as one of the leading candidate, joined by CAB president Sourav Ganguly and former cricketer Sunil Gavaskar for dinner with family.

వీరేంద్రుడినే వరించనున్న టీమిండియా ప్రధాన కోచ్ పదవి..?

Posted: 06/03/2017 07:50 PM IST
Virender sehwag dines with sourav ganguly and sunil gavaskar

ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం టీమిండియాతో కొనసాగేందుకు అనిల్ కుంబ్లే అంగీకరించలేదా? అంటే అవుననే మీడియా కథనాలు చెబుతున్నాయి. పోనీ కనీసం బీసీసీఐ సలహా సంఘం, మాజీ సహచరులు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ తో సమావేశమయ్యేందుకు కూడా సిద్ధంగా లేడా? అంటే లేడనే సమాధానం వినిపిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా కొత్త కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ను నియమించే అవకాశం కనిపిస్తోందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సెహ్వాగ్ కు కోచింగ్ లో పెద్దగా అనుభవం లేనప్పటికీ...ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మెంటార్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

విదేశీ కోచ్ కంటే వీరూ అయితే జట్టులో ఆటగాళ్లతో బాగా కలిసిపోయే అవకాశం ఉందని, అలాగే తన అభిప్రాయాలను చాకచక్యంగా చెప్పే సామర్థ్యం కూడా వీరూకి ఉందని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కుంబ్లేకు జట్టుతో కొనసాగే అవకాశం లేకపోతే... ఆటగాళ్లతో విభేదాలు ఉంటే... గతంలో ఆటగాళ్లు, కెప్టెన్ రెమ్యూనరేషన్ పై బీసీసీఐతో వివాదానికి ఎందుకు దిగుతాడు? జట్టు ఎంపికలో ఎందుకు భాగస్వామ్యం కోరుతాడు? అలాగే సుదీర్ఘ కాలం సహచరులుగా మెలగిన సచిన్, గంగూలీ, లక్ష్మణ్ ను కలిసేందుకు, పరిస్థితి వివరించేందుకు ఉన్న అభ్యంతరం ఏంటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు.

అయితే టీమిండియాతో పాకిస్థాన్ తలపడనున్న మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్న సెహ్వాగ్.. అక్కడ వెస్ట్ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీలో పాటు మరో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ లను కలుసుకున్నారు. అంతేకాదు వారికి కుటుంబాలతో కలసి లంచ్ కూడా చేశారు. దీంతో ఇక మొత్తానికి సెహ్వాగ్ టీమిండియా తరువాతి కోచ్ అంటూ వార్తలు మాత్రం హల్ చల్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india coach  virender sehwag  icc champions trophy  sourav ganguly  sunil gavaskar  bcci  cricket  

Other Articles