Kohli Team Handed New Jerseys Ahead of India-Pakistan Clash దాయాధితో పోరు కోసం కొత్త జెర్సీలు సిద్దం..

Champions trophy 2017 virat kohli and boys handed new jerseys ahead of india pakistan clash

champions trophy 2017, ICC Champions Trophy 2017, India vs Pakistan, Off The Field, oppo, Rahul Johri, Team India, virat kohli, cricket news, cricket, sports news, latest news

With defending champions India opening their Champions Trophy campaign against Pakistan in Edgbaston, Virat Kohli and boys were handed their new team jerseys.

దాయాధితో పోరు కోసం కొత్త జెర్సీలు రెడీ..

Posted: 06/03/2017 06:58 PM IST
Champions trophy 2017 virat kohli and boys handed new jerseys ahead of india pakistan clash

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత చిరకాల ప్రత్యర్థి, దాయాధి అయిన పాకిస్తాన్ తో మరి కొన్ని గంటల్లో రసవత్తరమైన పోరు జరగనుంది. ఈ పోరును వీక్షించేందుకు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు టీవీలకు అతుక్కుపోతున్నారు. అయితే ఆదివారం జరగనున్న భారత్‌- పాకిస్థాన్‌ మ్యాచ్ నేపథ్యంలో విరాట్ సేనకు సరికొత్త జెర్సీలను అందించింది జట్టు యాజమాన్యం. టోర్నీలో భారత్‌ తన తొలి మ్యాచ్లో కొత్త జెర్సీలు ధరించి ఆడనుంది.

టీమిండియాకు టెస్టు, వన్డే, టీ20 విభాగాలకు స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు బీసీసీఐతో ఒప్పో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం తర్వాత భారత్‌ తొలిసారి వన్డే మ్యాచ్‌లాడుతోంది. ఈ నేపథ్యంలో ఒప్పో నిర్వాహకులు భారత ఆటగాళ్లకు కొత్త జెర్సీలను అందించారు. కోహ్లీ, యువరాజ్‌ సింగ్‌, రహానె, శిఖర్‌ధావన్‌ తదితరుల ఆధ్వర్యంలో ఒప్పో సిబ్బంది జెర్సీని ఆవిష్కరించి ఆటగాళ్లకు చూపించారు. ఒప్పోకు ముందు ‘స్టార్‌ ఇండియా’ భారత జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Champions Trophy  india vs pakistan  virat kohli  new jersey  Team india  cricket  

Other Articles