Kapil Dev unveils wax statue at Tussauds ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే సత్తా భారత్ కు వుంది

India have capability to win icc champions trophy feels kapil dev

kapil dev wax statue, kapil dev madame tussauds, kapil dev wax statue madame tussauds, madame tussauds sachin tendulkar, madame tussauds sachin tendulkar, tendulkar movie, sachin movie, india cricket, cricket india, cricket news, cricket, sports news, sports

Former India skipper Kapil Dev put his money on the men-in-blue to lift the ICC Champions Trophy silverware next month in England but also said it depends on how they execute their plans during the June 1 to 18 event.

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే సత్తా భారత్ కు వుంది

Posted: 05/11/2017 09:04 PM IST
India have capability to win icc champions trophy feels kapil dev

అంతర్జాతయ క్రికెట్ మండలి అధ్వర్యంలో నిర్వహించనున్న ఐసీసీ చాంఫియన్స్ ట్రోఫీని సాధించే సత్తా టీమిండియా జట్టుకు పుష్కలంగా వుందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. అయితే ఈ ట్రోఫీలో మనవాళ్లు వేసే వ్యూహాలు, ప్రతివ్యూహాలను బట్టి విజయావకాశాలు మరింత బలపడతాయని అయన అన్నారు. అయితే ఇక్కడ జట్టు సభ్యులంతా ఐక్యంగా టీమ్ స్పిరిట్ కనబరిస్తే విజయం మనల్ని వరిస్తుందని కూడా చెప్పారు. ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ లో భారతీయ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మన అటగాళ్లు ప్రత్యర్థి జట్టు నుంచి ఎదురయ్య ఒత్తళ్లను కూడా ఎలా ఎదుర్కోంటారన్న దానిపై కూడా విజయం అధారపడి వుంటుందని అన్నారు. ఇక గొప్ప వ్యక్తుల సరసన తన విగ్రహాన్ని పెట్టడం తనకు ఎంతో గర్వకారణమని చెప్పారు. తన జీవితంలో ప్రతిక్షణం క్రెకెట్ నే శ్వాసించానని అన్నారు. 58 ఏళ్ల వయసులో తన మైనపు విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు. ఈ విగ్రహాన్ని తయారు చేయడం కోసం తన నుంచి 300 రకాలుగా కొలతలు తీసుకోవడం చాలా బాగా అనిపించిందని తెలిపారు. 1983 వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు కపిల్ దేవ్ కెప్టెన్ గా వ్యవహరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kapil dev  wax statue  madame tussauds  sachin tendulkar  cricket  

Other Articles