Jhulan Goswami becomes leading wicket-taker in women's ODIs అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్న జులన్ గోస్వామి

Jhulan goswami becomes leading wicket taker in women s odis

Jhulan Goswami, Indian Women’s Cricket Team, Most Wickets in Women’s ODIs, Neetu David, Cathryn Fitzpatrick, Indian women cricketer, south africa, cricket

Jhulan Goswami, former India cricket captain, is now the leading wicket-taker in Women’s ODIs -- surpassing Australian fast-bowler Cathryn Fitzpatrick’s record of 180 wickets.

అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్న జులన్ గోస్వామి

Posted: 05/09/2017 09:42 PM IST
Jhulan goswami becomes leading wicket taker in women s odis

భారత మహిళా క్రికెట్ జట్టు కూడా తనదైన శైలిలో విజయాలను సాధిస్తూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఆ క్రీడాకారుణిల ఖాతాలోకి కూడా రికార్డులు చేరుతున్నాయి. తాజాగా టీమిండియా మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి అరుదైన ఘనతను సాధించింది. తన పేరున అరుదైన రికార్డును రాసుకుంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న చతుర్ముఖ సిరీస్ లో భాగంగా మంగళవారం సఫారీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో గోస్వామి అత్యధిక వికెట్ల ఘనతను సాధించింది.

దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లోమూడు  వికెట్లు సాధించిన గోస్వామి.. ఓవరాల్ గా వన్డేల్లో 181 వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మహిళా బౌలర్ కాథరిన్ ఫిట్జ్పాట్రిక్స్ ను రికార్డును అధిగమించింది. దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ట్విట్టర్ లో ఆమెకు అభినందనలు తెలియజేసింది. ఇప్పటికే జులన్ ఎన్నో ఘనతల్ని సాధించిందని కొనియాడింది. ఈ మ్యాచ్ లో గోస్వామితో పాటు శిఖా పాండే మూడు వికెట్లతో రాణించడంతో దక్షిణాఫ్రికా 39.3 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jhulan Goswami  Indian women cricketer  south africa  cricket  

Other Articles