క్రికెట్ నిబంధనలలో కీలక మార్పు.. వాళ్లకూ కీపింగ్ చేసే ఛాన్స్. MCC to allow substitutes for injured keepers

Substitutes can keep wickets in mcc s new code of laws

12th man, long-standing rule preventing, marylebone cricket club, mcc, mcc’s new code of laws, substitute player, wicketkeeping, cricket

In the MCC’s new Code of Laws, the substitute fielders will be permitted to don the glove when a wicketkeeper suffers an injury

క్రికెట్ నిబంధనలలో కీలక మార్పు.. వాళ్లకూ కీపింగ్ చేసే ఛాన్స్

Posted: 04/13/2017 09:57 PM IST
Substitutes can keep wickets in mcc s new code of laws

అంతర్జాతీయ క్రికెట్ లో మరో మరో మార్పు చోటుచేసుకుంది. అయితే ఇది జట్టు బ్యాట్స్ మెన్, బౌలర్లకు సంబంధించినది కాకుండా పూర్తిగా వికెట్ కీపర్ కు సంబంధించినదే. సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత నిబంధనావళిలో ఓ మార్పు చోటుచేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ నిబంధనల రూపకర్త మేరిలిబోన్ క్రికెట్ క్లబ్ ఈ సవరణను ఆమోదించింది. వికెట్ కీపర్ గాయపడినప్పుడు అతని స్థానంలో ‘సబ్‌స్టిట్యూట్’ (12వ ఆటగాడు) బాధ్యత తీసుకోవచ్చునన్నదే ఈ మార్పు.

ఈ వెసులుబాటు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు అంపైర్ అంగీకారం ఉండాలనే షరతు కూడా విధించారు. గాయం కారణంగా అసలు వికెట్ కీపర్ ఇక ఆడలేడని అంపైర్ పూర్తిగా విశ్వసిస్తేనే సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ వికెట్ కీపర్ స్థానాన్ని భర్తీ చేయాల్సి వుంటుంది. ‘సబ్‌స్టిట్యూట్’ బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయడం, జట్టుకు సారథ్యం వహించడాన్ని మాత్రం గతంలో మాదిరిగానే అనుమతి లేదన్న విషయం తెలిసిందే

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles