అది అంపైర్ల తప్పేగా..? నిబంధనలు వర్తించవా..? David Warner’s ‘double hit’ caught umpires napping

David warner s double hit caught umpires napping

IPL 2017, David Warner, Sunrisers Hyderbad, Mumbai Indians, Indian Premier League, T20

Sunrisers Hyderabad skipper and opener David Warner’s move while batting against former champions Mumbai Indians left many viewers and experts zapped.

అది అంపైర్ల తప్పేగా..? నిబంధనలు వర్తించవా..?

Posted: 04/13/2017 08:44 PM IST
David warner s double hit caught umpires napping

ఐపీఎల్‌ సీజన్‌లో తరచూగా ఎంపైరింగ్‌ పొరపాట్లు, తప్పిదాలు దర్శనమిస్తున్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎంపైర్లు నిబంధనలను గాలికి వదిలేశారు. దీంతో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ ఆరో ఓవర్‌ చివరి బంతిని ఎదుర్కోవడంతో పాటు ఏడో ఓవర్‌ మొదటి బంతిని సైతం ఆడాడు. క్రికెట్‌ నిబంధనల ప్రకారం ఓవర్‌ ముగిస్తే స్ట్రైకింగ్‌ మారాల్సి ఉంటుంది. కానీ ఎంపైర్ల అలసత్వం వల్ల ఈ తప్పిదం జరిగింది.

శిఖర్‌ ధావన్‌తో కలిసి వార్నర్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో జస్ప్రీత్‌ బుమ్రా ఆరో ఓవర్‌ వేశాడు. ఆరో ఓవర్‌ చివరి బంతిని వార్నర్‌ ఫోర్‌గా మలిచాడు. దీంతో నిబంధనల ప్రకారం నాన్‌ స్ట్రైకింగ్‌లో ఉన్న ధావన్‌ స్థానం మార్చుకొని ఏడో ఓవర్‌ తొలి బంతిని ఎదుర్కోవాలి. కానీ, ఎంపైర్లు ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంతో వార్నరే ముంబై బౌలర్‌ మెక్లీనగన్‌ వేసిన ఏడో ఓవర్‌ తొలి బంతిని ఎదుర్కొని ఒక సింగిల్‌ కూడా తీశాడు. అయినా, ఎంపైర్లు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో మ్యాచ్‌ అలా సాగిపోయింది.

నిజానికి క్రికెట్‌ మ్యాచ్‌లలో ఎంపైర్లు తప్పిదాలు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. బౌలర్‌ వేసిన బంతులను తప్పుగా లెక్కబెట్టడం, ఒక్కోసారి బౌలర్‌తో అధిక బంతులు వేయించడం లాంటి పొరపాట్లు ఎంపైర్లు చేస్తుంటారు. కానీ ఓవర్‌ ముగిసిన తర్వాత నిబంధనల ప్రకారం జరగాల్సిన లీగల్‌ క్రాసింగ్‌ ఓవర్‌ను పట్టించుకోకపోవడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. అంఫైర్లు సరే.. మరి బ్యాట్స్ మెన్లు ఏం చేస్తున్నారు? అన్న ప్రశ్నలు కూడా రేకెత్తుతున్నాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 2017  David Warner  Sunrisers Hyderbad  Mumbai Indians  Indian Premier League  T20  

Other Articles