ఆ రికార్డును అందుకుంటానని కలగనలేదు..! Yuzvendra Chahal's 6/25 the best for India in T20Is

Yuzvendra chahal s 6 25 the best for india in t20is

India vs England, Yuzvendra Chahal, Twenty20, bangalore, chinaswamy stadium, R Ashwin, Virat Kohli, Moeen Ali, Joe Root, cricket news, sports news, cricket, sport

Yuzvendra Chahal bowled India to a 2-1 series win on Wednesday in Bangalore, taking the best figures by an Indian bowler in Twenty20 internationals

ఆ రికార్డును అందుకుంటానని కలగనలేదు..!

Posted: 02/02/2017 07:16 PM IST
Yuzvendra chahal s 6 25 the best for india in t20is

లెగ్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌.. ఒక్క మ్యాచ్ తో దేశవ్యాప్తంగానే కాదు యావత్ క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాడు. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న మ్యాచ్ ను ఏకంగా ఏకపక్షంగా మార్చేసి.. ఔరా అనిపించాడు. తన స్పిన్‌  మాయాజాలంతో ఇంగ్లండ్‌ జట్టును చుట్టుముట్టాడు. అనూహ్యరీతిలో ప్రత్యర్థులను టపాటపా ఆరు వికెట్లు పడగొట్టిన నేపథ్యంలో చాహల్ భారత్ తరపున అరుదైన ఘనతను అందుకున్నాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో అరు వికెట్లను తీసి ఉత్తమ గణంకాలను నమోదు చేసి రికార్డు నెలకొల్పాడు.

రెండో ఇన్నింగ్స్ లో 13వ ఓవర్‌లో 119/2 వికెట్లతో బలంగా కనిపించిన ఇంగ్లాండ్ జట్టు ఆ తర్వాత కేవలం 8 పరుగులు జోడించి చివరి 8 వికెట్లు కోల్పోవడం గమనార్హం. అందుకు కారణం యువ స్పిన్నర్‌ చాహల్‌ మాయాజాలమే. అతను స్పిన్‌ బంతులను ఎదుర్కోలేక ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్ చేతులెత్తేశారు. దీంతో ఆరు వికెట్లను కొల్లగొట్టిన చాహల్‌ తన కెరీర్‌లోనే తొలిసారి ఉత్తమ గణాంకాలను నమోదుచేశాడు. మూడవ టీ-20లో స్టార్‌ ఆఫ్‌ ద నైట్‌గా నిలిచాడు.

ఆరు వికెట్లు పడగొడతానని తాను కలలో కూడా అనుకోలేదని మ్యాచ్ అనంతరం చాహల్ చెప్పాడు. బెంగళూరులో తొలిసారి టీమిండియా తరఫున ఆడటం ఆనందం కలిగించింది. సొంతూరులో ఉండి ఆడినట్టు అనిపించింది. ఆరు వికెట్లు తీస్తానని కలలో కూడా అనుకోలేదని చెప్పాడు. 25 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టిన చాహల్‌ భారత్‌ తరఫున టీ-20లో ఉత్తమ గణాంకాలు నమోదుచేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌లలో ఆరు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  Yuzvendra Chahal  Twenty20  bangalore  cricket  sport  

Other Articles