చాహల్ పై గంగూలీ ఆసక్తికర కామెంట్ Chahal a product of IPL says Sourav Ganguly

Chahal a product of ipl says sourav ganguly

India vs England, Yuzvendra Chahal, Twenty20, Sourav Ganguly, bangalore, chinaswamy stadium, cricket news, sports news, cricket, sport

Former India captain Sourav Ganguly credited the Indian Premier League for the rise of Chahal, who plays for Royal Challengers Bangalore in the IPL.

చాహల్ పై మాజీ కెప్టెన్ ఆసక్తికర కామెంట్

Posted: 02/02/2017 06:32 PM IST
Chahal a product of ipl says sourav ganguly

మూడో టీ-20 మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టి.. భారత్‌కు అద్భుత విజయాన్ని అందించిన యజువేంద్ర చాహల్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. చాహల్‌ స్పిన్‌ మాయాజాలంతో 13 ఓవర్ల వరకు పటిష్టంగా కనిపించిన ప్రత్యర్థులను కేవలం ఎనిమిది పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లు కోల్పోయేట్లు చేసిన ఘనత చాహల్ దే. అయితే ఈ విజయంపై క్యాబ్ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ మాట్లాడుతూ.. అతను ఐపీఎల్‌ ప్రాడక్ట్‌ అని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ తరఫున ఆడటం వల్ల చాహల్‌ రాటుదేలాడు అని పేర్కొన్నాడు.

’చాహల్‌ బెంగళూరు రాయల్‌ చాలెంజర్‌ బౌలర్‌ అన్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ వేదికపై ఆడటం అతనికి తెలుసు. టీ-20 క్రికెట్‌ ఐపీఎల్‌ ప్రాడక్ట్‌. అదేవిధంగా చాహల్‌ కూడా ఐపీఎల్‌ ప్రాడక్టే. ఐపీఎల్‌లో ఆడటం ద్వారా అతను ఎంతగానో మెరుగయ్యాడు. కచ్చితంగా ఏం చేయాలో అతనికి తెలుసు. అతను టెర్రిఫిక్‌గా ఆడాడు. భారత టీ-20లపై ఐపీఎల్‌ విస్తారమైన ప్రభావాన్ని చూపుతోంది. చాలామంది ఆటగాళ్లు దానినుంచే వచ్చి భారత్‌ తరఫున అద్భుతంగా ఆడుతున్నారు’ అని గంగూలీ గుర్తుచేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  Yuzvendra Chahal  Twenty20  Sourav Ganguly  cricket  sport  

Other Articles