రెండో టెస్టుకు ఇంగ్లాండ్ కు అందుబాటులో అండర్ సన్ England receive James Anderson boost

Anderson set to join up with england squad

James Anderson, india, england, test series, india vs England, ind vs eng, James Anderson england, Anderson england, ind vs eng, sports, sports news, cricket score, cricket news, cricket

England have received a significant boost with the news that James Anderson will be able to join their Test squad in India almost immediately.

రెండో టెస్టుకు ఇంగ్లాండ్ కు అందుబాటులో అండర్ సన్

Posted: 11/05/2016 07:48 PM IST
Anderson set to join up with england squad

సుదీర్ఘ సిరీస్ నేపథ్యంలో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు మరింత బలోపేతం కానుంది. గత కొంతకాలంగా గాయంతో బాధపడుతూ ఇంగ్లండ్ జట్టుకు దూరంగా ఉంటున్న ప్రధాన పేసర్ జేమ్స్ అండర్సన్.. భారత్తో జరిగే ద్వైపాక్షిక సిరీస్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు.  తాజాగా అండర్సన్కు నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో పాస్ కావడంతో అతను భారత్తో జరిగే సిరీస్లో పాల్గొననున్నాడు. ఈ మేరకు త్వరలో అండర్సన్ భారత్కు పయనం కానున్నట్లు ఈసీబీ స్పష్టం చేసింది.

నేషనల్ క్రికెట్ పెర్ఫామెన్స్ సెంటర్లో అండర్సన్ కు నిర్వహించిన ఫిట్ నెస్ పరీక్షల్లో పాసయినట్లు క్రికెట్ బోర్డు తెలిపింది. కొన్ని నెలులుగా భుజం గాయంతో ప్రధాన టోర్నీలకు దూరంగా ఉన్న అండర్సన్ జట్టుతో కలవడం ఇంగ్లండ్ కు కచ్చితంగా అదనపు బలమే. అయితే ఈనెల 9వ తేదీన రాజ్కోట్లో ఆరంభమయ్యే తొలి టెస్టు నాటికి అండర్సన్ అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. భారత్ లో సిరీస్లో పాల్గొనేందుకు అండర్సన్ కు లైన్ క్లియరైనప్పటికీ రెండో టెస్టు మొదలయ్యే సమయానికి అతను జట్టుతో కలిసే అవకాశం ఉంది..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : james anderson  england  ind vs eng  Team India  Cricket  

Other Articles