భారత్-ఇంగ్లాండ్ సిరీస్ లో ఆ నలుగురిదే ఆట.. England will face difficulty to cope with Indian conditions: Rhodes

Kohli vs broad ashwin vs cook battles will be key

Virat Kohli, Stuart Broad, R Ashwin, Alastair Cook, Jonty Rhodes, India vs England, south africa, sports, sports news, cricket, cricket news

Former South African batsman Jonty Rhodes feels if skipper Virat Kohli fires with the bat then India will have little to worry about.

భారత్-ఇంగ్లాండ్ సిరీస్ లో ఆ నలుగురిదే ఆట..

Posted: 11/05/2016 08:25 PM IST
Kohli vs broad ashwin vs cook battles will be key

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్లో నలుగురు ఆటగాళ్లు ఆటే కీలకం కానుందని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. ఐదు టెస్టుల సిరీస్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ లు బ్యాటింగ్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందన్నాడు. అదే సమయంలో బౌలింగ్ లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, భారత బౌలర్ అశ్విన్లు కీలకమని అంటున్నాడు.

ఈ సిరీస్లో విరాట్ - స్టువర్ట్ బ్రాడ్...అలెస్టర్ కుక్ -అశ్విన్ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుందన్నాడు. ఒక సమరం ముగిసిన తరువాత మరో సమరం అనే విధంగా ఇరు జట్ల సిరీస్ రసవత్తవరంగా సాగే అవకాశం ఉంటుందని రోడ్స్ అభిప్రాయపడ్డాడు. అయితే ఇంగ్లండ్ ప్రస్తుత జట్టుకు భారత్లో పరిస్థితులపై అంతగా అవగాహన లేదని విషయాన్నిఅంగీకరించాలన్నాడు.  ఐపీఎల్ ఆడిన అనుభవం ఆటగాళ్లు ఇంగ్లండ్ జట్టులో పెద్దగా లేకపోవడంతో ఇక్కడ స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడం వారికి అత్యంత కష్టమన్నాడు.

ఇద్దరూ విభిన్న శైలి కల్గిన కెప్టెన్లు. అనుభవం పెద్దగా లేని జట్టుకు అలెస్టర్ కుక్ కెప్టెన్గా ఉంటే, విరాట్ కోహ్లి అద్భుతమైన ఫామ్తో పాటు జట్టును ముందుండి విజయపథంలో నడిపిస్తున్నాడు. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో పోల్చితే విరాట్ శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఫీల్డ్లో ఎప్పుడూ దూకుడుగా ఉండే కోహ్లి, అదే క్రమంలో భారీగా పరుగులు కూడా సాధిస్తున్నాడు. ఒకవేళ విరాట్ విఫలమైతే అది ఫలితంపై ప్రభావం చూపుతుంది. ఈ సిరీస్లో విరాట్ తన శక్తిని పూర్వస్థాయిలో ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విరాట్ రాణిస్తే మాత్రం ఇంగ్లండ్కు కష్టాలు తప్పవు' అని రోడ్స్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Stuart Broad  R Ashwin  Alastair Cook  Jonty Rhodes  cricket  

Other Articles