అలా జరిగివుంటే.. ధోని ఒత్తిడికి గురయ్యేవాడు MS Dhoni would have been under pressure had India lost series: Sourav Ganguly

Ms dhoni would have been under pressure had india lost series sourav ganguly

india vs new zealand, ind vs nz, india new zealand, ms dhoni, sourav ganguly, amit mishra, mishra, amit mishra on kumble, amit anil 5 wicket haul, india vs new zealand score, ind vs nz score, cricket score, cricket news, cricket

MS Dhoni won his first home series in 24 months as India destroyed New Zealand by 190 runs in the final ODI to win the series 3-2.

అలా జరిగివుంటే.. ధోని ఒత్తిడికి గురయ్యేవాడు

Posted: 10/30/2016 03:55 PM IST
Ms dhoni would have been under pressure had india lost series sourav ganguly

న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ నిర్ణయాత్మక ఐదో వన్డేలో భారత్ పరాజయం చెంది ఉంటే అది భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీపై తీవ్ర ప్రభావం చూపేదని మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఐదో వన్డేలో గెలుపు అనేది అటు భారత్ క్రికెట్ జట్టుకే కాదు.. కెప్టెన్ ధోనికి కూడా చాలా ముఖ్యమైనదనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. అయితే భారత జట్టు విజయం సాధించడంతో చాలా ప్రశ్నలను పక్కకు  నెట్టిందన్నాడు.
 
విశాఖలో జరిగిన చివరి వన్డేలో గెలుపుపై సంతోషం వ్యక్తం చేసిన గంగూలీ.. కీలమైన మ్యాచ్లో భారత్ తిరిగి పుంజుకోవడం నిజంగా ధోనికే అత్యంత  అవసరమన్నాడు. 'ఈ మ్యాచ్లో విజయం  ధోనికి అత్యంత ముఖ్యం. అతన్ని నిరూపించుకోవడానికి కివీస్తో వన్డే సిరీస్ సవాల్గా నిలిచింది. ఒకవేళ చివరి వన్డేలో ఓటమి చెందినట్లయితే, అది ధోని కెరీర్పై ప్రభావం చూపేది. ముఖ్యంగా అతను కెప్టెన్సీపై తీవ్ర ఒత్తిడి వచ్చేది. అటు బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ రాణించిన భారత్ విజయం సాధించడానికి అన్ని అర్హతలున్నాయి' అని గంగూలీ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs new zealand  ms dhoni  sourav ganguly  cricket  

Other Articles