బిసిసిఐ నిర్ణయాన్ని స్వాగతించిన మాజీ కెప్టెన్లు Ganguly, Azhar back BCCI decision to use Decision Review System

Ganguly azhar back bcci decision to use decision review system

Decision Review System, DRS, Former India captains, Sourav Ganguly, Mohammad Azharuddin, BCCI, trail, five match series,, England, India vs England, Ind vs Eng, sports, sports news, cricket news, cricket

Former India captains Sourav Ganguly and Mohammad Azharuddin were happy that India will at last use the DRS, albeit as a trial, during the five-match Test series against England.

బిసిసిఐ నిర్ణయాన్ని స్వాగతించిన మాజీ కెప్టెన్లు

Posted: 10/22/2016 06:49 PM IST
Ganguly azhar back bcci decision to use decision review system

అంపైర్ తీసుకున్న నిర్ణయంపై సంతృప్తి చెందని పక్షంలో పున:సమీక్ష కోసం అభ్యర్థించే పద్ధతి(డీఆర్ఎస్)ను ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సుముఖత వ్యక్తం చేయడంపై మాజీ టీమిండియా కెప్టెన్లు గంగూలీ, అజారుద్దీన్ లు వేర్వేరుగా సంతృప్తి వ్యక్తం చేశారు. డీఆర్ఎస్ పై బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో సంతోషంగా ఉన్నట్లు భారత మాజీ కెప్టెన్లు మొహ్మద్ అజహరుద్దీన్, సౌరవ్ గంగూలీలు స్పష్టం చేశారు. తాను ఆడుతున్న రోజుల నుంచి డీఆర్ఎస్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని. ప్రస్తుతం డీఆర్ఎస్ విధానం అప్పటికంటే చాలా మెరుగ్గా ఉందని గంగూలీ అన్నాడు.

దాంతో బీసీసీఐ ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి వెనకడుగు వేయలేదు. అందుకు కారణం కూడా లేదనే అనుకుంటున్నా. ఇంగ్లండ్ తో డీఆర్ఎస్ను పరీక్షించాలనే నిర్ణయం నిజంగా ఆహ్వానించదగిందేనని గంగూలీ తెలిపాడు. 'భారత జట్టు ఇప్పటికే డీఆర్ఎస్ టెక్నాలజీని వాడుకోవాల్సింది. ఈ టెక్నాలజీకి అప్పట్లో బీసీసీఐ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో అనేక మ్యాచ్లను దగ్గరగా వచ్చి కోల్పోయాం. కాస్త ఆలస్యమైనా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం బాగుంది. ఇది ఒక మంచి ఆలోచన'అని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో అజహరుద్దీన్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DRS  Former India captains  Sourav Ganguly  Mohammad Azharuddin  BCCI  cricket  

Other Articles

Today on Telugu Wishesh