బిసిసిఐకి సుప్రీం షాక్, అర్థిక అధికారాలకు తాత్కాలిక కళ్లెం.. SC deals huge blow to BCCI, curbs financial powers

Supreme court deals huge blow to bcci curbs its financial powers

Lodha Panel, Lodha recommendations, Anurag Thakur, BCCI, Supreme Court, Cricket, India vs New Zealand, BCCI vs Lodha Panel, Corruption in cricket, Lodha, BCCI vs Lodha, Dhoni, Kohli, cricket news, sports news, sports, cricket

Supreme Court has dealt a severe blow to BCCI, severely curtailing its financial powers. It said, the Lodha panel would fix a limit on monetary value of contracts in which BCCI can enter, all contracts above the monetary limit would have to be approved by the panel.

బిసిసిఐకి సుప్రీం షాక్, అర్థిక అధికారాలకు తాత్కాలిక కళ్లెం..

Posted: 10/21/2016 06:56 PM IST
Supreme court deals huge blow to bcci curbs its financial powers

భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)కి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది. జస్టిస్ లోధా కమిటీ ప్రతిపాదించిన పలు సూచనలు అమలో జాప్యం చేసిన కారణంతో పాటు. తమ అనుమతి లేకుండా రాత్రికి రాత్రే వందల కోట్ల రూపాయల నిధులను అనుబంధ రాష్ట్ర స్థాయి సంఘాలకు ట్రాన్స్ ఫర్ చేసిన విషయంలో అగ్రహంతో వున్న అత్యున్నత న్యాయస్థానం బిసిసిఐకి భారీ షాక్ ఇచ్చింది. బిసిసిఐ అధ్యక్షుడితో పాటుగా సభ్యులందరికీ తాత్కాలికంగా అర్థిక అధికారాలను నిలిపివేసింది.

లోథా కమిటీ మానిటరీ కాంట్రాక్టు మేరకు మాత్రమే ఇకపై నిధులు విడుదల జరపాలని, వాటిని మించిన నిధులు కావాల్సిన నేపథ్యంలో మళ్లీ లోథా కమిటీ అనుమతి పోందాలని న్యాయస్థానం పరుధులను విధించింది. ఇకపై రాష్ట్ర సంఘాలకు నిధుల విడుదల విషయంలో తప్పనిసరిగా తీర్మాణం చేయాలని అదేశించింది. ఈ క్రమంలో జస్టిస్ లోధా కమిటీని స్వతంత్ర అడిటర్లతో నిధుల ఖర్చుల విషయంలో పర్యవేక్షణ జరిపించాలని కూడా అదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 5వ తేదికి వాయిదా వేసింది.

కాగా ఈ తీర్పును తాము ఇంకా అధ్యయనం చేయాల్సివుందని, అధ్యయనం చేసిన తరువాతే తీర్పుపై స్పందిస్తానని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పేర్కోన్నారు. అప్పటి వరకు అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై తాను ఎలాంటి వ్యాక్యలు చేయబోనని చెప్పారు. ఒకసారి సుప్రీం తీర్పు కాపీని చూసిన తరువాత ఏమైనా మాట్లాడటానికి అవకాశం ఉంది. మాకున్న కష్టసాధ్యమైన అంశాలను కోర్టుకు సూచించాం. మా ఆర్థిక వ్యవహారాలను అధ్యయనం చేసే ప్రక్రియలో భాగంగా లోధా కమిటీ ఒక ఆడిటర్ ను నియమించుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అది క్రికెట్ పై ఎంత ప్రభావం చూపుతుంది అనేది పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. అయితే కాపీ తీర్పును పూర్తిగా చదివిన తరువాత మాట్లాడతా' అని అనురాగ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  Lodha recommendations  Anurag Thakur  BCCI  Supreme Court  cricket  

Other Articles