అసీస్ స్లెడ్జింగ్ కు ఆ స్రోకు చెక్ పెడుతుందన్న డూప్లెసిస్ Australian sledging will be kept in check, says du plessis

Australian sledging will be kept in check says du plessis

australia south africa, faf du plessis, south africa 5-0 australia, south africa odis, australia odis, australia vs south africa, ab de villiers injury, cricket news, sports news

SOUTH AFRICA captain Faf du Plessis believes Australia will head into next month's Test series against his team mentally scarred following their odi series white wash by the proteas.

అసీస్ స్లెడ్జింగ్ కు ఆ స్రోకు చెక్ పెడుతుందన్న డూప్లెసిస్

Posted: 10/18/2016 06:35 PM IST
Australian sledging will be kept in check says du plessis

ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించిన అస్ట్రేలియన్లను ఇటీవల జరిగిన ఐదు వన్డేల సిరీస్లో పూర్తిగా వైట్ వాష్ చేసిన దక్షిణాఫ్రికా.. వారితో జరగనున్న టెస్టు సిరీస్ లోనూ అదే ఒరవడిని కొనసాగించాలని భావిస్తుంది. ఇందుకు గాను అప్పడే మైండ్ గేమ్ ను కూడా ప్రారంభించింది. అసలే వన్డే సిరస్ ను కోల్పోయి పీకల్లోతు పరాభవంతో కుంగిన ఆస్ట్రేలియాను మరింతగా కృంగిపోయేట్లు చేయడంలో అప్పడే సఫారీల నాయకుడు డు ప్లెసిస్ వారిపై ప్రభావవంతమైన వ్యాఖ్యలను చేశాడు.  

వన్డేల్లో కంగారులకు మరచిపోలేని స్ట్రోక్ ఇచ్చామని, టెస్టు సిరీస్ లోనూ అదే స్ట్రోక్ పనిచేస్తుందని కెప్టెన్ డు ప్లెసిస్ అంటున్నాడు. ఆసీస్ స్లెడ్జింగ్ కు తామిచ్చిన స్ట్రోక్ చాలా బాగా పనిచేస్తుందని అయన ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తామిచ్చిన స్ట్రోక్ కంగారులకు చాలాకాలం గుర్తుండిపోయే చేదు జ్ఞాపకమని పేర్కొన్నాడు. తమ దేశంలో జరిగిన సిరీస్లో ఆసీస్ అలా ఓడిపోవడం ఆ జట్టును మానసికంగా బలహీనపరుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.

'మాతో టెస్టు సిరీస్కు వారు డిఫరెంట్ జట్టుతో వస్తారు. వన్డేల్లో కంటే మంచి జట్టుతోనే ఆసీస్ టెస్టు సిరీస్ కు సిద్ధమవుతుంది. టెస్టు సిరీస్ లో మంచి ఆరంభాన్ని దక్కించుకోవాలంటే నాణ్యమైన జట్టు అనేది ముఖ్యం. మాతో జరిగిన వన్డే సిరీస్ వారికి మరచిపోలేని అనుభవం. అది ఆసీస్ కు ఎదురైన చిన్న దెబ్బ కాదు.. ఆ జట్టును మానసికంగా బలహీనపరిచే స్ట్రోక్' అని డు ప్లెసిస్ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : south africa  australia  one-day series  faf du plessis  cricket  

Other Articles