యువరాజ్ కు చుక్కెదురు.. గంభీరుడు చిన్నబుచ్చుకున్నాడు.. వాళ్లకు సవాల్ విసురాడు.. Yuvraj tries to make fun of Gambhir but gets trolled in return

Gautam gambhir trolls yuvraj singh but unhappy with virender sehwag s birthday tweet

Gautam Gambhir, Yuvraj Singh, Hazel Keech, Virat Kohli, Web Exclusive, Cricket, Twitter reactions, Gambhirs Birthday, virender sehwag, yuvraj singh, birthday tweet, punjab ranji trophy, ranji trophy news, sports, sports news, cricket, cricket news

Sehwag surprised everyone with a normal tweet while wishing his best friend Gautam Gambhir, with whom he has shared plenty of memorable moments while playing for India.

యువరాజ్ కు చుక్కెదురు.. గంభీరుడు చిన్నబుచ్చుకున్నాడు..

Posted: 10/15/2016 06:55 PM IST
Gautam gambhir trolls yuvraj singh but unhappy with virender sehwag s birthday tweet

టీమిండియాలో ఆల్‌ రౌండర్ యువరాజ్ సింగ్, ఓపెనర్ గౌతమ్ గంభీర్ వి విభిన్నమైన మనస్తత్వాలు. యువీ సరదాగా ఉంటూ చెలరేగుతాడు. గంభీర్ అలా కాదు గంభీరంగా ఉంటూ, ఎప్పుడు పేలిపోదామా? అని ఎదురుచూసే డైనమేట్ లా ఉంటాడు. వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ సోషల్ మీడియాలో చోటుచేసుకుని, అభిమానుల ముఖాల్లో నవ్వులు పూయించింది. అయితే గంభీర్ తనలోని గాంభీర్యాన్నే కాదు చమత్కారాన్ని కూడా జతకలపిన ట్విట్టుతో అయన అభిమానులకు కొత్త కోణం అర్థమైంది.

గౌతమ్ గంభీర్ నిన్న తన 35వ పుట్టిన రోజును జరుపుకున్నాడు. దీనిని పురస్కరించుకుని యువరాజ్ సింగ్ ‘‘ పుట్టిన రోజు శుభాకాంక్షలు మిస్టర్ గౌతమ్ గంభీర్.. వికెట్ల మధ్యన నవ్వు ముఖంతో నువ్వు పరిగెత్తాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను’’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి సమాధానమిచ్చిన గౌతీ ‘యువీస్ట్రాంగ్ సోదరా ధన్యవాదాలు. రోజులు దగ్గర పడుతున్నాయికదా...నువ్వు కూడా సిద్ధమవ్వు... పెళ్లికాగానే వంట గది, పడక గది మధ్యన వేగంగా పరుగెత్తడానికి’ అంటూ చమత్కరించాడు. ఈ సంభాషణ క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాయి.

కాగా, యువీ బాలీవుడ్ నటీ, మోడల్ హజెల్ కీచ్‌‌ ను త్వరలో వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఇదిలా వుండగా బర్త్ డే బాయ్ గంభీర్ మాత్రం తనకు వచ్చిన ఓ ట్విట్ తో చిన్నబుచ్చుకున్నాడు. అదేనండీ అయనతో పాటు చాలా కాలంపాటు టీమిండియా అన్ని ఫార్మెట్లలో ఓపెనింగ్ జోడీగా వున్న వీరేంద్ర సెహ్వాగ్.. పంపిన ట్విట్ చూసి గంభీర్ కొంచెం కలత చెందాడు, నిత్యం కొంచెం వెటకారంతో కూడిన ట్విట్ చేస్తూ భారత్ క్రికెట్ అభిమానులను అలరిస్తున్న సెహ్వాగ్ సాధాసీదా గంభీర్ కు ట్విట్ చేశాడు, దీంతో గంభీర్ బదులిస్తూ.. మీ స్టైల్ లో విషెస్ ఊహించానని చెప్పి చిన్నబుచ్చుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gautam gambhir  virender sehwag  yuvraj singh  birthday tweet  cricket  

Other Articles