నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో ధోనికి బాగా తెలుసు.. MS Dhoni knows when to hand over ODI captaincy

Ms dhoni knows when to hand over odi captaincy to virat kohli says former selector pranab roy

india vs new zealand, india vs new zealand statistics, india vs nz stats, india new zealand stats, team india, one day cricket, MS Dhoni, india, Pranab Roy, virat kohli, sports, cricket

Former Indian selector Pranab Roy weighed in on the captaincy debate and reaffirmed that MS Dhoni knows when to hand over the limited-overs captaincy to Virat Kohli

నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో ధోనికి బాగా తెలుసు..

Posted: 10/14/2016 09:58 PM IST
Ms dhoni knows when to hand over odi captaincy to virat kohli says former selector pranab roy

టీమిండియా కెప్టెన్ గా కోనసాగుతారా..? లేక కెప్టెన్సీ పగ్గాలను టెస్టు మ్యాచ్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అప్పగిస్తారా..? అన్న ప్రశ్నలు మీడియా నుంచి ఎదురవుతున్న ప్రతీసారి ఎంతో ఒప్పిగ్గా సమాధానమిచ్చారు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. మరోమారు న్యూజీలాండ్ తో సిరీస్ ప్రారంభం కానున్న తరుణంలో ఇలాంటి ప్రశ్నలే మళ్లీ ఉత్పన్నమయ్యే అవకాశాలు వున్నాయి. కాగా అది సరైన చర్య కాదని అంటున్నాడు మాజీ భారత సెలక్టర్ ప్రణబ్ రాయ్.

2004లో బంగ్లాదేశ్ వన్డే సిరీస్లో ధోని ఎంపిక కావడానికి ప్రధాన కారణమైన ప్రణబ్ రాయ్.. ఇంకా భారత క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ ను మార్చాల్సిన అవసరం రాలేదంటున్నాడు. 'కెప్టెన్సీ నుంచి ధోని ఎప్పుడు వైదొలగాలో అతనికి తెలుసు. ప్రస్తుతం ధోనికి ప్రత్యామ్నాయం లేదు. అతను ఒక ఆటగాడిగా, నాయకుడిగా సక్సెస్ అయ్యాడు. అసలు కెప్టెన్సీ మార్పు గురించి ఆలోచనే వద్దు. కోహ్లికి బాటన్ ఎప్పుడు ఇవ్వాలో ధోనికి తెలుసు'అని ప్రణబ్ రాయ్ తెలిపాడు.

గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో జరిగిన పలు టెస్టు మ్యాచ్లను కోల్పోవడంతో ధోని ఆకస్మికంగా ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో అతని నిర్ణయం తనను ఆశ్చర్య పరిచింది. 90 టెస్టుల్లో ఆడిన ధోని ఆ తరహా నిర్ణయం తీసుకుంటాడని అస్సలు అనుకోలేదని ప్రణబ్ తెలిపాడు. కాగా, అతను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయానికి అంతా గౌరవం ఇవ్వాలన్నాడు. అయితే ఒక  సెలక్టర్ గా ధోని ఎంపిక చేయడం తన అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటిగా నిలిచిపోతుందన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : team india  one day cricket  MS Dhoni  india  Pranab Roy  virat kohli  india vs new zealand  cricket  

Other Articles