తొలి ఇన్నింగ్స్ లో కుప్పకూలిన కివీస్ Indore Test: Ashwin gives India edge over New Zealand on Day 3

Indore test ashwin gives india edge over new zealand on day 3

india vs new zealand, india vs new zealand statistics, india vs nz stats, india new zealand stats, virat kohli, virat kohli double century, ravichandran ashwin, ashwin, r ashwin indore, r ashwin india, sports, cricket

India were batting on 18/0 at the end of Day 3 of the third Test match of the series in Indore, as New Zealand failed to make the most of a strong start as they were dismissed for 299.

ఇండోర్ టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో కుప్పకూలిన న్యూజీలాండ్

Posted: 10/10/2016 06:12 PM IST
Indore test ashwin gives india edge over new zealand on day 3

ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడవ టెస్టులో కివీస్ జట్టు ధీటైన అరంభాన్ని చేసినా.. తరువాత బ్యాటింగ్ అర్ఢర్ పూర్తిగా విఫలం అయ్యింది, భారత స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ చెలరేగిపోవడంతో కివీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 299 పరుగులకే ఆలౌటైంది. 28/0 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ కు గప్టిల్(72), లాధమ్(53) లు మంచి ఆరంభాన్నిచ్చారు. ఈ ఓవర్ నైట్ ఓపెనర్లు ఇద్దరూ భారత్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ 118 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.  

అయితే లాధమ్ తొలి వికెట్ గా అవుటైన తరువాత కివీస్ పతనం ఆరంభమైంది. కేవలం 30 పరుగుల వ్యవధిలో మరో నాలుగు వికెట్లను నష్టపోవడంతో కివీస్ తేరుకోలేకపోయింది. ఈ రోజు ఆటలో లంచ్ విరామానికి 125/1 తో దీటుగా బదులిస్తున్నట్లు కనిపించిన కివీస్ ఆపై వరుసగా కీలక వికెట్లను చేజార్చుకుంది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో లాధమ్, గప్టిల్ తరువాత నీషామ్(71) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

భారత బౌలర్లు అశ్విన్ ఆరు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించగా, జడేజాకు రెండు వికెట్లు లభించాయి. మరో రెండు వికెట్లు రనౌట్లు రూపంలో వచ్చాయి. దీంతో భారత్ కు 258 పరుగుల ఆధిక్యం లభించింది. కివీస్ ను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నా భారత్ తన రెండో ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : team india  test cricket  ravichandran ashwin  india vs new zealand  indore  cricket  

Other Articles