ఆ ఫోన్ తో రహానేలో అత్మవిశ్వాసం పెరిగింది.. master plan behind Ajinkya Rahane’s mastery

How ajinkya rahane overcame his struggles from day one

ajinkya rahane, rahane, rahane career, ajinkya rahane records, ajinkya rahane mentor, pravin amre , amre, ajinkya rahane pravin amre, cricket news, cricket

Ajinkya Rahane, who has never shown his aggression outwardly but for his mentor Pravin Amre one has to go deep within Rahane's heart to see it.

ఆ ఫోన్ తో రహానేలో అత్మవిశ్వాసం పెరిగింది..

Posted: 10/10/2016 04:12 PM IST
How ajinkya rahane overcame his struggles from day one

పర్యాటక జట్టు న్యూజీలాండ్ తో ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న మూడవ టెస్టులో అధికంగా బౌన్సర్ బంతులను ఎదుర్కోన్న కీలక ఆటగాడు అజింక్య రహానే 186 పరుగుల చేయడం వెనుక రహస్యమేమిటో తెలుసా..? తన టెస్టు బ్యాటింగ్ గురువు ప్రవీణ్ అమ్రే చెప్పిన మాటలే. కివీస్ బౌలర్ల నుంచి వస్తున్న బౌన్సర్లతో తన తల పగిలిపోయేలా వుందని, ఇలాంటి తరుణంలో ఏం చేయాలని రహానే.. అమ్రేకు ఫోన్ చేసి ప్రత్యర్థుల వ్యూహం వివరించాడని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతనే పేర్కొన్నాడు.

రహానే నుంచి వచ్చిన ప్రశ్నకు ప్రవీణ్ చక్కగా సమాధానం ఇచ్చాడు, రహానేలో అత్మవిశ్వాసాన్ని పూరించాడు, అయితే ఇంతకీ ప్రవీణ్ అమ్రే ఎవరో తెలుసా..? గతంలో టీమిండియా టెస్టు క్రికెటర్ గా ఆకట్టుకున్నాడు. ఇండోర్ లో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో తొలి రోజు 70 పరుగులు చేసిన రహానే తలకు ఒక బౌన్సర్ తగిలింది. దీనితోపాటు రహానే ఛాతిని లక్ష్యం చేసుకుని బంతులు వేశారు. రహానేను అవుట్ చేసేందుకు కివీస్ బౌలర్లు రచించిన వ్యూహంలో భాగంగా బౌన్సర్లు సంధిస్తున్నారు.

తన తల, ఛాతి లక్ష్యం చేసుకుని బంతులేస్తున్నారు. వాటిని ఎదుర్కోవడం ఎలా? అంటూ రహానే ఆయనకు ఫోన్ చేసి సలహా అడిగాడని ఆయన చెప్పారు. దానికి తాను మంచి బంతులను గౌరవించాలని, బౌన్సర్లను వదిలేయాలని ఆయన సూచించారు. క్రీజులో ఎంత ఎక్కువ సమయం ఉంటే అన్ని ఎక్కువ పరుగులు వస్తాయని ఆయన సలహా ఇచ్చారు. బౌన్సర్లకు టెంప్ట్ కావద్దని చెప్పడంతో రహానే...బౌన్సర్ల వ్యూహంతో బంతులేస్తున్న కివీస్ బౌలర్లపై తన వ్యూహం అమలు చేశాడని, దీంతో 188 పరుగులు సాధించి, అద్భుతమైన ఇన్నింగ్స్ నిర్మించాడని ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ajinkya rahane  pravin amre  Indore test  India vs New Zealand  cricket  

Other Articles