సెహ్వాగ్ ధమాకా దార్ షాట్లు పేలుతున్నాయి.. Virender Sehwag's This Tweet Put Team Australia In Shock!

Virender sehwag s this tweet put team australia in shock

virender sehwag, south africa, australia, twitter, cricket, troll, Team India, Indian cricket, cricket, cricket news, sports, sports news

Former cricketer Virender Sehwag, who took the internet by storm through his hilarious and sarcastic tweets in the recent past, is back with a bang again.

సెహ్వాగ్ ధమాకా దార్ షాట్లు పేలుతున్నాయి..

Posted: 10/01/2016 06:57 PM IST
Virender sehwag s this tweet put team australia in shock

టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్, ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన రెండో ఇన్నింగ్స్ లో దమాకాధార్ షాట్లు కోడుతున్నాడు. అయన చేతుల నుంచి జాలువారిన షాట్లు సోషల్ మీడియాలో బాగా పేలుతున్నాయి, అర్థమైంది కదా.. ఆయన రెండో ఇన్నింగ్స్ షోషల్ మీడియా వేదికగా సాగుతున్న విషయం అయన అభిమానులతో పాటు క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయమే. అయితే ఏం సందర్భం వచ్చినా సమయానుకూలంగా కొంత వ్యంగంగా స్పందించే భిన్నమైన మనసత్తత్వం అయనది.

నిన్న మోన్నటి వరకు ఇంగ్లాండ్ జర్నలిస్టును ఉతికి అరేసిన సెహ్వాగ్.. ఈసారి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును టార్గెట్ చేశాడు. అదేంటి అసీస్ ను ఎందుకు టార్గెట్ చేశాడు, క్రికెట్ ప్రపంచంలో ప్రత్యర్థి జట్లకన్నా పైచేయిలో కొనసాగుతున్న కంగారులను ఆయన తన ట్విట్లతో కంగారు పెట్టించాడు. ఇందుకు కారణం దక్షిణాఫ్రికా చేతిలో ఆసీస్ ఘోర పరాజయం చెందడమే.ఒకవైపు దక్షిణాఫ్రికా ఓపెనర్ డీ కాక్ చేతిలో తీవ్రంగా భంగ పడిన ఆస్ట్రేలియా పూర్తిగా డైలామాలో పడితే... ఆ జట్టును ఏం బాదావంటూ మన 'ట్విట్టర్ కింగ్' సెహ్వాగ్  ట్వీట్ చేశాడు.

'డీ కాక్.. వాట్ ఎ నాక్.. ధమాకా దార్ నాక్' అంటూ కొనియాడాడు. కేవలం ఒక్కడికి దాసోహమైన ఆసీస్కు ఇద్ది పెద్ద షాక్ అంటూ ట్వీట్ చేశాడు. సెంచూరియన్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆసీస్ విసిరిన 295 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా సునాయాసంగా ఛేదించింది. ఆస్ట్రేలియాపై డీకాక్ (178:16 ఫోర్లు, 11 సిక్సర్లు) విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా 36.2 ఓవర్లలోనే విజయాన్ని సొంతం చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  Virender Sehwag  south africa  australia  cricket  

Other Articles