రెండో టెస్టులనూ పైచేయి దిశగా టీమిండియా.. Bhuvneshwar five-for puts hosts in command on Day 2

Bhuvneshwar five for puts hosts in command on day 2

ind vs nzl second test, Eden Garden, new zealand, bhuvaneshwar kumar, wriddhiman saha, Team India, virat kiohli, anil kumble, cricket, cricket news, India, India vs New Zealand 2016, Martin Guptill, new zealand, sports news, sports

Bhuvi takes two in two. Sends Santner and Henry packing to take a stunning five-wicket haul. The momentum has completely shifted to India now.

రెండో టెస్టు రెండో రోజు కివీస్ పై పైచేయి దిశగా టీమిండియా..

Posted: 10/01/2016 06:10 PM IST
Bhuvneshwar five for puts hosts in command on day 2

మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ బంతితో బాగా రాణించడంతో భారత్ పర్యాటక జట్టుపై అధిక్యం కనబర్చింది, 239/7 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఇన్నింగ్స్ ను కొనసాగించిన కోహ్లీసేన మరో 77 పరుగులను జత చేసి మిగతా మూడు వికెట్లను కోల్పోయి 316 పరుగుల వద్ద అలౌట్ అయింది. భారత్ కు గౌరవప్రదమైన స్కోరును అందించేందుకు రెండో రోజున మిడిల్అర్డర్ అల్ రౌండర్ వృద్దిమాన్ సాహ దోహదపడ్డారు.

తొలిరోజు 14 పరుగులు సాధించిన సాహ.. రెండో రోజు 7 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్థశతకాన్ని నమోదు చేశాడు, ఆ తరువాత కేవలం నాలుగు పరుగులు మాత్రమే సాధించి 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. దీంతో భారత్ మూడు వంద మార్కును దాటింది. అంతకుముందు రవీంద్రజడేజా కేవలం 14 పరుగులకే ఔటయ్యి వెనుదిరిగాడు. . న్యూజిలాండ్ అటాక్ ను సమర్ధవంతంగా ఎదుర్కోవడంతో పాటు చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. టెయిలెండర్ మొహ్మద్ షమీ(14)తో కలిసి చివరి వికెట్ కు 35 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు.

అంతకుముందు భారత ఆటగాళ్లలో చటేశ్వర పూజారా(87),  అజింక్యా రహానే(77)లు జట్టును ఆదుకున్నారు. టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ జోడి 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.కివీస్ బౌలర్లలో హెన్రీ మూడు వికెట్లతో సత్తా చాటగా, బౌల్ట్ , వాగ్నర్,  జీతన్ పటేల్ లు తలో రెండు వికెట్లు సాధించారు. 317 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజీలాండ్ భారత్ బౌలర్ల ధాటికి నిలబడలేకపోయింది. భారత పేసర్లు విసిరిన బంతులకు బొక్కబోర్లాపడింది.

రెండో టెస్టు మ్యాచ్ లో రెండో రోజు ఆటముగిసే సమయానికి న్యూజీలాండ్ ను భవనేశ్వర్ కుమార్ ధాటిగా దెబ్బతీశాడు. వరుణుడు మధ్యలో అటకు అటంకాన్ని కల్పించినా.. భువనేశ్వర్ రెండో స్పెల్ లో వరుసగా రెండు బంతులకు ఇద్దరు కివీస్ బ్యాట్స్ మెన్లను పెవిలియన్ ను పంపి మరో ఫిఫర్ (ఐదు వికెట్ల రికార్డును) తన ఖాతాలోకి వేసుకున్నాడు, కేవలం పది ఓవర్లలో 33 పరుగులను ఇచ్చిన భువి.. ఐదు వికెట్లను పడగోట్టాడు. భువికి తోడుగా షమీ, జడేజాలు కూడా చెరో వికెట్ సాధించారు. న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్లలో రాస్ టైలర్ 36 పరుగులతో, లూక్ రాంచీ 35 పరుగులతో రాణించారు. కాగా మిగిలిన బ్యాట్స్ మెన్లు అందరూ స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles