భారత్ వేదికగా న్యూజిలాండ్‌తో జరగబోయే 3 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. సందీప్ పాటిల్ నేతృత్వంలో ముంబయిలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ అనిల్ కుంబ్లే పాల్గొన్నారు. జట్టుకు ఎంపికైన ఆటగాళ్ల పేర్లు.. విరాట్ కోహ్లీ(కెప్టెన్), రాహుల్, పూజారా, రహానే, విజయ్, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, సాహా, రవీంద్ర జడేజా, షమీ, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్.
మరో అవకాశం ఇచ్చారు
రోహిత్ శర్మను టెస్టు జట్టులోకి తీసుకుంటారా లేదా అనే చర్చకు తెరపడింది. జట్టులోకి రోహిత్ శర్మను ఎంపిక చేశారు. టెస్టుల్లో రోహిత్ శర్మకు పేలవమైన రికార్డ్ ఉండడంతో జట్టులోకి ఎంపిక చేస్తారా లేదా అనే చర్చలు జరిగాయి. కొంతకాలంగా తుది జట్టులో స్థానాన్ని కోల్పొతున్న రోహిత్‌కు కోహ్లీ మద్ధతు ఇవ్వడంతో మరోసారి జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నెల 22న కాన్పూర్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. అనంతరం 5 వన్డే మ్యాచ్‌లు జరగునున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more