India vs West Indies: In a first, India win two Tests in the Caribbean

India thrash windies by 237 runs seal series 2 0

india vs west indies, ind vs wi, wi vs ind,india vs west indies, ind vs wi, wi vs ind, west indies, bhuvneshwar kumar, bhuvneshwar kumar wickets, bhuvneshwar kumar bowling, r ashwin, rahane, rohit sharma, kl rahul, saha, west indies bowling, sports news, sports, cricket news, cricket

India had declared their second innings at 217/7 and then bowled out West Indies for just 108 runs to win by 237 runs.

మరో మ్యాచ్ మిగిలిండగానే.. టెస్టు సిరీస్ లలో టీమిండియా హ్యట్రిక్

Posted: 08/14/2016 11:35 AM IST
India thrash windies by 237 runs seal series 2 0

వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది.  భారత క్రికెట్ జట్టు వరుసగా మూడో  సిరీస్ విజయం దక్కించుకుంది. 2006, 2010ల్లో కరీబియన్లను ఓడించిన భారత్... ప్రస్తుతం జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో చేజిక్కించుకుంది. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో జరుగుతున్న మూడవ టెస్టులో ఫలితం తేలుతుందా.? లేదా..? అన్న అభిమానుల ఉత్కంఠకు తెరదించుతూ.. కోహ్లీ సేన విజయాన్ని నమోదు చేసింది.

ఈ పర్యటనలో తొలి టెస్టులో ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసుకున్న టీమిండియా.. రెండో టెస్టుపై కూడా పూర్తి పట్టు బిగించింది. అయితే అనూహ్యంగా వరుణడు ఈ మ్యాచ్ కు నాల్గవ రోజు అడ్డంకిగా నిలచి.. వీండీస్ కు మద్దతుగా నిలిచి.. టీమిండియా విజయాన్ని అడ్డుకున్నాడు. అదే తరహాలో మూడోవ టెస్టులోనూ వరుణడు అడ్డంకిగా నిలచి ఫలితం తేల్చుతాడా లేదా..? అన్న సందేహాలను పటాపంచలు చేశాడు. టీమిండియా అద్భతు బౌలింగ్ తో మూడో టెస్టులో విజయాన్ని అందించాడు.

వెస్టిండీస్ను మూడో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు కోల్పోయి 157 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఐదవ రోజు బరిలోకి దిగిన కోహ్లీ సేన ఏడు వికెట్ల కోల్పియి 217 పరుగుల వద్ద వుండగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో భారత్కు 346 పరుగుల ఆధిక్యం లభించింది. చివరకు టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించి 237 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. 346 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కరీబియన్లు... రెండో ఇన్నింగ్స్‌లో 47.3 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటయ్యారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 48 ఓవర్లలో ఏడు వికెట్లకు 217 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.

భారత్ తొలి ఇన్నింగ్స్: 353; రెండో ఇన్నింగ్స్ 217/7 డిక్లేర్

వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 225 ఆలౌట్: రెండో 108 అలౌట్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs west indies  ind vs wi  wi vs ind  mohammad shami  rahane  rohit sharma  cricket  

Other Articles