India vs West Indies: Visitors in control after Ajinkya Rahane ton on Day 3

Rahane s ton strengthens india with 304 run lead in rain hit kingston test

india vs west indies, ind vs wi, ind wi, india west indies, ajinkya rahane, rahane india, india rahane, cricket news, cricket score, cricket, sports news, sports

Ajinkya Rahane’s ton helped India pile more pressure on the struggling West Indies unit with a first innings lead of 304 runs.

రహానే శతకంతో పటిష్టస్థితిలో టీమిండియా

Posted: 08/02/2016 02:25 PM IST
Rahane s ton strengthens india with 304 run lead in rain hit kingston test

నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో కింగ్స్టన్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియ విండీస్ పై 304 పరుగుల అధిక్యాన్ని నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 500 పరుగుల వద్ద తొమ్మిది విక్కట్ల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ లోకేష్ రాహుల్ వెస్టిండీస్‌తో అడిన తొలి టెస్టులోనే 158 పరుగులను సాధించగా, వైస్ కెప్టెన్ అజింక్య రహానే అజేయ సెంచరీ( 237 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి తన నిలకడ ఆటతీరును మరోసారి నిరూపించుకున్నాడు.

టీమిండియా 2013-14లో చేసిన దక్షిణాఫ్రికా పర్యటన నుంచి ప్రతి టెస్టు సిరీస్ లో నిలకడగా పరుగులు చేస్తున్న ఆటగాడు రహానే. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఫీట్ సొంతం చేసుకున్నాడు. వరుసగా ఎనిమిది టెస్టు సిరీస్ లలో భాగంగా ప్రతి టెస్టులో కనీసం ఒక ఇన్నింగ్స్ లో 90 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక భారత ఆటగాడిగా రహానే నిలిచాడు. రహానే ఏడు టెస్టు సెంచరీలు చేయగా, అందులో 5 ఉపఖండం బయట చేసినవే. దక్షిణాఫ్రికాపై (96), బంగ్లాదేశ్ పై (98) రెండు సెంచరీలను మిస్సయ్యాడు.

మరోవైపు విండీస్ బౌలర్ రోస్టన్ ఛేజ్(5/121) చెలరేగుతున్నా మరో ఎండ్ లో పాతుకుపోయిన రహానే,  సాహా(47), మిశ్రా(21), ఉమేశ్ యాదవ్(19)లతో కలిసి భాగస్వామ్యాలు నిర్మించి భారత్ను పటిష్టస్థితికి చేర్చాడు. 500 పరుగుల వద్ద 9వ వికెట్ గా ఉమేశ్ యాదవ్ (14 బంతుల్లో 19 పరుగులు; 4 ఫోర్లు) చేజ్ బౌలింగ్‌లో ఔట్‌ కావడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీంతో భారత్కు 304 పరుగుల ఆధిక్యం లభించింది. వర్షం కారణంగా విండీస్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించలేదు. విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 196 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ajinkya rahane  India vs West Indies 2016  Team india  Test series  BCCI  cricket  

Other Articles