KL Rahul becomes fifth Indian to score a ton in 1st innings in West Indies

Kl rahul sets seven records

kl rahul inida windies series, kl rahul inida windies series news, kl rahul inida windies series latest news, kl rahul inida windies series batsmen, kl rahul inida windies series batting, india vs west indies, ind vs wi, india cricket, kl rahul rahul, rahul records, rahul runs, indian cricket team, cricket news, cricket

KL Rahul break's Ajay Jadeja's record of highest runs scored in debut against West Indies in West Indies after his marvellous knock of 158.

విండీస్ పై లోకేష్ రాహుల్ రికార్డుల నమోదు

Posted: 08/02/2016 01:01 PM IST
Kl rahul sets seven records

కింగ్ స్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండవ టెస్ట్‌లో ఓపెనర్ లోకేష్ రాహుల్ అద్భుత శతకంతో రాణించింది. విండీస్ తో అడిన తొలిమ్యాచ్ లోనే లోకేష్ రాహుల్ 158 పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడాడు. మురళీ విజయ్‌ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరం కావడంతో జట్టులోకి వచ్చిన రాహుల్ తనకు వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. 303 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లు, 52.15 స్ట్రైక్ రేట్‌తో 158 పరుగులు చేశాడు. అయితే తాను ఈ స్కోర్ చేసేన క్రమంలో పలు రికార్డుల నమోదయ్యాయి.
 
వెస్టిండీస్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన తొలి భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ లోకేష్ రాహుల్‌. ఒక భారత బ్యాట్స్‌మెన్‌గా వెస్టిండీస్‌లో ఓపెనింగ్‌కు దిగి తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన ఆటగాళ్లు లోకేశ్ రాహుల్ ముందు వరకూ ఎవరూ లేరు. అయితే అంతకుముందు 1997లో అజయ్ జడేజా విండీస్‌లో ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా తాను ఆడిన తొలి మ్యాచ్‌లో చేసిన 96 పరుగులే ఇప్పటివరకూ అత్యధికమైనవి. అయితే ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగకపోయినప్పటికీ వెస్టిండీస్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో సెంచరీలు నమోదు చేసిన భారత ఆటగాళ్లు మొత్తం ఐదుగురు. వారిలో లోకేష్ చేసిన 158 పరుగులే అత్యధికమైనవి.
 
ఆ ఐదుగురు భారత ఆటగాళ్ల వివరాలు..
1) లోకేష్ రాహుల్ 158 పరుగులు - 2016లో
2) పాలి ఉమ్రిగర్ 130 - 1953లో
3) బ్రిజేష్ పటేల్ 115 - 1976లో
4) అశ్విన్ 113 - 2016లో
5) సంజయ్ మంజ్రేకర్ 108 - 1989లో

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lokesh rahul  India vs West Indies 2016  Second Test  Test series  BCCI  cricket  

Other Articles