Misbah warns Pakistan, says Test series against England 'not over yet'

Misbah ul haq wary of england backlash after lord s win

England vs Pakistan 2016,Pakistan Cricket,England Cricket,Misbah-ul-Haq,Cricket

Pakistan captain Misbah-ul-Haq has described the win at Lord’s as a very special win and he revealed that he had always dreamt of winning at the Mecca of Cricket.

అతి కాదు.. ఈ కారణాలు చాలదా.. పాక్ ఫీట్లపై వివరణ..

Posted: 07/21/2016 03:04 PM IST
Misbah ul haq wary of england backlash after lord s win

నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా లార్డ్స్లో జరిగిన తొలి మ్యాచ్లో 75 పరుగల తేడాతో విజయాన్ని అందుకున్న తరుణంలో పాకిస్తాన్ అటగాళ్లు విజయగర్వంతో చేసిన అరుదైన ఫీట్లపై ఓవర్ అంటూ కామెంట్లు రావడంపై పాకిస్తాన్ కెప్టెన్ మిస్బావుల్ హక్ వివరణ ఇచ్చాడు. ఇక్కడ విజయం సాధించడం తమ క్రికెట్ జట్టుకు ఎంతో ప్రత్యేకమని హక్ అభిప్రాయపడ్డాడు. ఆరేళ్ల క్రితం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో పలువురు పాకిస్తాన్ ఆటగాళ్లు నిషేధం ఎదుర్కొన్న ఇదే వేదికలో విజయం సాధించడం జట్టులో తిరిగి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుందన్నాడు. మూడున్నరేళ్ల తర్వాత ఆసియా ఉపఖండం వెలుపల పాక్ సాధించిన తొలి విజయం కావడం గమనార్హం.

'కాబుల్ ఆర్మీ క్యాంపు సిబ్బంది పర్యవేక్షణలో పాక్ ఆటగాళ్లు శిక్షణ పొందారు. కఠోరశ్రమతో కూడిన ఫీట్స్ చేశాం. ఆర్మీతో కలిసి పుష్ అప్స్ చేసేవాళ్లం. అందుకే వారికి ఈ విజయంలో భాగం ఉందని తెలిపేందుకు, ఆర్మీ వారికి ఈ విషయం గుర్తుకుతేవడానికి ఇంగ్లండ్ పై గెలిచిన అనంతరం లార్డ్స్ లో పాక్ ఆటగాళ్లు పుష్ అప్స్ తీశారు' అని మిస్బా వివరించాడు. సెంచరీ చేసిన అనంతరం మిస్బా కూడా పుష్ అప్స్ తీశాడు.  ఆర్మీ వారు తమలో స్ఫూర్తిని నింపారని, మూడు టెస్టుల్లోనూ మంచి ఫలితాలు రాబడతామని ధీమా వ్యక్తం చేశాడు. సర్ఫరాజ్ అహ్మద్, అసద్ షఫిఖ్ భాగస్వామ్యంతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించారని కొనియాడాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Misbah-ul-Haq  Pakistan  England  Lord's  cricket  

Other Articles