Kumble-Fan Murali Vijay Wants to Learn From New Head Coach

I am a big fan of anil kumble says murali vijay

anil kumble, kumble, india head coach, chief coach, coach anil kumble, coach kumble, sanjay bangar, bangar, bangar kumble, kumble bangar, anil sanjay, sanjay, india cricket, cricket india, india cricket news, India's head coach, BCCI, cricket, cricket news

India opening batsman Murali Vijay is a big fan of newly-appointed head coach Anil Kumble and says the players have got a golden opportunity to learn from new coach Anil Kumble.

కుంబ్లే కోచ్ గా రావడం ఓ సువర్ణావకాశం

Posted: 07/01/2016 04:48 PM IST
I am a big fan of anil kumble says murali vijay

భారత క్రికెట్ ప్రధాన కోచ్గా అనిల్ కుంబ్లే ఎంపిక కావడం నిజంగా తమకు దక్కిన సువర్ణావకాశమని ఓపెనర్ మురళీ విజయ్ తెలిపాడు. ఆ దిగ్గజ ఆటగాడు దగ్గర్నుంచి అనేక విషయాలను నేర్చుకుని అత్యుత్తమ ప్రతిభ కనబర్చడానికి ఇది తమకు కలసి వచ్చిన అవకాశమని, అందుకోసం భారత క్రికెట్ జట్టు ఎదురుచూస్తుందన్నాడు. తాను కుంబ్లేకు పెద్ద అభిమానినని పేర్కొన్న విజయ్.. అతను భారత్ క్రికెట్ ను మరింత ముందుకు తీసుకువెళ్తాడన్నాడు.
 
'నేను యువకుడిగా ఉన్న దగ్గర్నుంచీ నేను పెద్ద అభిమానిని. అయినప్పటికీ నేను కుంబ్లేతో ఎక్కువ సమయం గడపే అవకాశం రాలేదు. నా తొలి టెస్టు మ్యాచే.. అతనికి చివరి టెస్టు మ్యాచ్ అయ్యింది. అందుచేత అతనితో ఎక్కువగా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని పంచుకోలేదు. మరొకసారి అతనితో కలిసి భాగస్వామ్యం అయ్యే అవకాశం లభించింది. అతని ఎంపిక భారత జట్టుకు లభించిన గొప్ప వరం. యువ క్రికెటర్లు కుంబ్లే నుంచి చాలా విషయాలు నేర్చుకుంటార’ అని మురళీ విజయ్ తెలిపాడు. గతంలో టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రితో కొన్ని అద్భుతమైన క్షణాలను పేర్కొన్న విజయ్.. ఇప్పుడు కుంబ్లే రూపంలో ఒక గొప్ప కోచ్ వచ్చాడన్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Murali Vijay  anil kumble  India's head coach  BCCI  cricket  

Other Articles