This Sachin Tendulkar travel picture makes you feel so patriotic!

Sachin tendulkar discovers saare jahan se achcha island

Sachin Tendulkar, Sachin Tendulkar holiday, Sachin Tendulkar Facebook, Sachin Tendulkar Tweet, Sachin Tendulkar bharat island, Sachin Tendulkar travel pictur, Latest sports news

Indian batting legend Sachin Tendulkar shared a picture of himself in front of a water body which formed the shape of India.

సచిన్ కనుగోన్న ’సారే జహాసే అచ్చా‘ ఇదే..!

Posted: 06/30/2016 06:45 PM IST
Sachin tendulkar discovers saare jahan se achcha island

భారతదేశాన్ని కనుగొన్నది వాస్కోడగామా అన్న సంగతి తెలిసిందే. అయితే క్రికెట్ దేవుడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఒక 'భారత్'ను కనుగొన్నాడు. ఏంటి సచిన్ తాజాగా భారత్ ను కనుగొనడం ఏమిటా? అని ఆశ్చర్యపోకండి. సచిన్ కనుగొన్నది  భారత్ను పోలి ఉన్న ఒక చెరువును కనుగొన్నాడు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సచిన్.. ఓ ఐస్లాండ్కు వెళ్లిన క్రమంలో అతనికి భారత్ దేశ పటంలా ఉన్న చెరువు కనిపించింది.  

దీంతో ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. దాన్ని ఫోటోలో రూపంలో బంధించి అభిమానులతో పంచుకున్నాడు. ఆ సెలయేరు ముందు నిలబడి ఉన్న సచిన్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి 'సారే జహాన్ సే అచ్చా హిందూస్థాన్ హమారా' అనే క్యాప్షన్ కూడా జోడించి దేశంపై అభిమానాన్ని చాటుకున్నాడు. 'తాను కొన్ని దీవుల్ని సందర్శించేటప్పుడు  సెలయేరు కనిపించింది. అది అచ్చం భారతదేశ పటంలానే ఉంది' అని సచిన్ పేర్కొన్నాడు.

అయితే పలువురు కేవలం విమర్శించడమే పనిగా పెట్టుకునే వాళ్లు కూడా లేకపోలేదు. అలాంటి వారు సచిన్ అభిమానులతో పంచుకున్న భారత్ ఫోటోపై కూడా విమర్శలు గుప్పించారు. ఒకరు మీరు ముంబై, మహారాష్ట్రలో నిల్చుని సెల్సీ దిగారా..? అని ప్రశ్నించగా, మరోకరు సచిన్ ఫోటోలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ రెండు కూడా భారత్ లో కలసి వున్నాయని, బహుశా మోడీగారు ఈ రెండు దేశాలను భారత్ లో కలపిసి వుంటారని వ్యంగ వ్యాఖ్యాలు చేశారు. ఇక మరికోందరు కేరళలో వున్నారని ఇంకోందరు ఇంకో రకంగా విమర్శలు చేఃస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  India  indian shape lake  twitter  fans  patriotic  travel picture  cricket  

Other Articles