hashim amla breaks another virat kohli record becomes fastest to 23 odi hundreds

Virat kohli buys rs 34 crore apartment in worli

virat kohli, india, hashim amla, south africa, tri-series, amla breaks kohli record, kohli record break, virat kohli flat, kohli new flat, kohli luxuey flat, kohli flat cost, cricket

Amla has enhanced his skills and now he is one of the best in the world. Amla is a brilliant ODI batsman and he has been chasing Virat Kohli’s records.

ఇక్కడ ఇంటివాడైన కోహ్లీ.. అక్కడ రికార్డు బద్దలు

Posted: 06/17/2016 07:49 PM IST
Virat kohli buys rs 34 crore apartment in worli

వాళ్లిద్దరూ  ఆ రెండు జట్లకు వెన్నెముకలాంటి వాళ్లు. ఇద్దరి ఆటశైలి పూర్తిగా భిన్నం. ఒకరు నెమ్మదిగా సాంప్రదాయ తరహాలో తమ ఆటతీరుతో అలరిస్తే... మరొకరు దూకుడుతో చెలరేగిపోతారు. దాదాపుగా ఒకేసారి వన్డే కెరీర్‌ను ప్రారంభించిన ఈ ఇద్దరి కెరీర్ పోటాపోటీగా సాగుతోంది.  ఆ ఇద్దరూ ఎవరో కాదు.. ఒకరు దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా అయితే మరొకరు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి. ఒకరి రికార్డును మరొకరు అధిగమిస్తూ పోటీలు పడి పరుగుల వర్షం కురిపిస్తున్నారు.  విరాట్ వన్డేల్లో నెలకొల్పిన వేగవంతమైన 23 సెంచరీల రికార్డును సఫారీ ఆటగాడు ఆమ్లా అధిగమించడమే వారి మధ్య పోటీకి అద్దం పడుతోంది.

ముక్కోణపు సిరీస్ లోభాగంగా వెస్టిండీస్తో  బుధవారం జరిగిన వన్డేలో ఆమ్లా శతకంతో అలరించాడు.  దీంతో కోహ్లి 23 వేగవంతమైన సెంచరీల రికార్డు బద్దలైంది.  విరాట్ 157 ఇన్నింగ్స్లలో 23వ సెంచరీని చేస్తే,  ఆమ్లాకు 132వ ఇన్నింగ్స్లోనే ఆ మార్కును చేరాడు.    సమకాలీన క్రికెట్లో ఈ ఇద్దరు క్రికెటర్లు 2008లోనే అంతర్జాతీయ వన్డే కెరీర్ను ఆరంభించడం మరో విశేషం.  ఒకవైపు రికార్డులు సృష్టించుకుంటూ విరాట్ ముందుకు సాగుతుంటే, ఆమ్లా వాటిని అధిగమిస్తునే ఉన్నాడు.

గతంలో వేగంగా 20 సెంచరీలు, ఐదు వేల పరుగులులాంటి  కోహ్లి సాధించిన ఘనతలను ఆమ్లా బ్రేక్ చేశాడు. మరోవైపు విరాట్ పిన్నవయసులో నమోదు చేసిన 10 సెంచరీల వన్డే రికార్డును దక్షిణాఫ్రికాకే చెందిన డీకాక్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అధిగమించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా డీ కాక్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. డీకాక్ 23 సంవత్సరాల 54 రోజుల వయసులో 10 సెంచరీలు చేస్తే,  అదే  విరాట్ 10 సెంచరీలు  చేయడానికి  23 సంవత్సరాల 159 రోజులు పట్టింది. ఇదిలా ఉండగా కోహ్లి ఇప్పటివరకూ 171 వన్డే ఇన్నింగ్స్ల్లో 25వ సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

మరోవైపు ఇవాళ విరాట్ కోహ్లి ఓ ' ఇంటి' వాడయ్యాడు. తాజాగా అత్యంత విలాసవంతమైన  ఓ అపార్ట్ మెంట్ ను విరాట్ తాజాగా కొనుగోలు చేసి ఇంటివాడయ్యాడు. ముంబై నగరంలో వార్లీ ప్రాంతంలో ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ సూపర్ లగ్జరీ ప్రాజెక్ట్  టవర్ -సిలో  35వ అంతస్తును  విరాట్ కొనుగోలు చేశాడు. సుమారు 7,171 చదరపు అడుగుల వైశాల్యం గల అపార్ట్ మెంట్ విలువ రూ. 34 కోట్లు. గత కొన్ని నెలల నుంచి ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ తో  చర్చలు సాగించిన పిదప విరాట్ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశాడు.

అయితే విరాట్ ఖరీదు చేసిన ఈ అత్యంత విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ఐదు బెడ్ రూమ్లను కల్గి ఉండటమే కాకుండా, నేరుగా సముద్రాన్ని వీక్షించే అవకాశం ఉంది.  ఇక్కడ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేయాలని విరాట్ గతేడాదే ఫిక్సయ్యాడట. దానిలో భాగంగానే 2015లో ఈ సైట్ను గర్ల్ ఫ్రండ్ అనుష్క శర్మతో కలిసి  విరాట్ వీక్షించాడు.  ఇదిలా ఉండగా మరో క్రికెటర్ యువరాజ్ సింగ్కు కూడా గతంలో ఇదే టవర్-సిలో ఓ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేయడం విశేషం. 2014లో 29వ అంతస్తును యువరాజ్ సింగ్ ఖరీదు చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  india  hashim amla  south africa  tri-series  cricket  

Other Articles