Dasun Shanaka enters record books with 5 for 43 on debut

Ireland fall short in sri lanka run chase

dasun shanaka,ireland,ireland vs sri lanka,ireland vs sri lanka 2016,sri lanka,sri lanka tour of ireland 2016,sri lanka vs ireland,sri lanka vs ireland 2016, cricket

Sri Lanka finally tasted victory on their 2016 tour of the British Isles with a 76-run win over Ireland at Malahide (near Dublin).

అరంగ్రేటంతో అదరగొట్టిన లంక బౌలర్..

Posted: 06/17/2016 07:16 PM IST
Ireland fall short in sri lanka run chase

తొలి వన్డేలోనే శ్రీలంక బౌలర్ దాసన్ షనక సత్తా చాటాడు. అరంగ్రేటంలోనే 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్ లో మెరుపులు చూపించాడు. రెండు వన్డేల సిరీస్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో శ్రీలంక 76 పరుగులతో విజయం సాధించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన లంక 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. వికెట్ కీపర్ చందిమాల్ సెంచరీ సాధించాడు. 107 బంతుల్లో 6 ఫోర్లతో శతకం బాదాడు. మెండిస్ 51, మాథ్యూస్ 49 పరుగులు చేశారు. షనక వేగంగా ఆడి 19 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లలో 42 పరుగులు బాదాడు.

వర్షం కొంత సేపు మ్యాచ్ ను అడ్డుకున్న నేపథ్యంలో తరువాత బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ కు డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 47 ఓవర్లలో 293 పరుగుల టార్గెట్ పెట్టారు. కాగా, లంక చేతిలో పసికూన ఐర్లాండ్ చతికిల పడింది. 40.4 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. పోర్టర్ ఫీల్డ్(73), ఓబ్రీన్(64) అర్ధ సెంచరీలతో రాణించారు. డీ/ఎల్ ప్రకారం శ్రీలంక 76 పరుగులతో గెలిచినట్టు అంపైర్లు ప్రకటించారు. శ్రీలంక బౌలర్లలో 5 వికెట్లు పడగొట్టాడు. మాథ్యూస్ 2 వికెట్లు తీశాడు. వన్డేల్లో ఫస్ట్ మ్యాచ్ లోనే 5 వికెట్లు పడగొట్టిన 12వ బౌలర్ గా షనక గుర్తింపుపొందాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dasun Shanaka  bowler  Sri lanka  Chandimal century  ireland  cricket  

Other Articles