Virender Sehwag trolls Pakistani cricket fans on Twitter following ICC Champions Trophy draw

Virender sehwag advised pakistan fans ahead of encounter with india

ICC Champions Trophy,Indian Cricket,Pakistan Cricket,Virender Sehwag,Virat Kohli, virender-sehwag, india, pakistan, champions trophy, Cricket

Former Indian opener, Virender Sehwag has been very active on Twitter off-late and has now taken a light-hearted jibe on Pakistani fans.

ITEMVIDEOS: పాక్ క్రికెట్ అభిమానులకు సెహ్వాగ్ సూచన..

Posted: 06/05/2016 04:33 PM IST
Virender sehwag advised pakistan fans ahead of encounter with india

భారత-పాకిస్తాన్ల జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే విపరీతమైన క్రేజ్. ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే తీవ్రమైన ఉత్కంఠ నెలకొంటుంది. ఇందులో ఏ జట్టు ఓడిపోయినా అభిమానుల కోపాగ్నికి గురి కాక తప్పదు. ఇటీవల టీ 20 వరల్డ్ కప్లో భారత్ చేతిలో పాక్ ఓడిపోవడంతో ఆ దేశంలో అభిమానులు బహిరంగంగానే ఆగ్రహం వెల్లగక్కారు.  అటు ఆటగాళ్ల దిష్టి బొమ్మలను దహనం చేయడంతో పాటు, టీవీలను కూడా పగలుగొట్టారు. అయితే 2017 లో జరుగనున్న ఐసీసీ చాంపియన్ ట్రోఫీలో భారత-పాక్ జట్లు ఒకే గ్రూప్లో  ఉండటంతో టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ముందుగానే జోస్యం చెప్పేశాడు.
 
భారత జట్టు క్రికెట్ గెలుస్తుందని ప్రత్యక్షంగా చెప్పకపోయినా, ఈసారి పాక్ అభిమానులు టీవీలు పగలు గొట్టవద్దంటూ ట్వీట్ చేశాడు. 'ప్రియమైన పాక్ సహోదరులకు ఇదే నా విజ్ఞప్తి. చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా పాక్ అభిమానులు టీవీలు దయచేసి టీవీలు జోలికి వెళ్లవద్దని కోరాడు. వచ్చే ఏడాది జూన్ నెలలో చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. జూన్ 1వ తేదీ నుంచి 18 వరకూ జరుగనున్న ఈ టోర్నమెంట్కు సంబంధించిన గ్రూప్లను ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ ట్విట్టర్లో స్పందించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virender-sehwag  india  pakistan  champions trophy  

Other Articles