David Warner gets out hit wicket during Kings XI Punjab vs Sunrisers Hyderabad,

Warner breaks record then his own stumps

david warner,indian premier league,ipl,ipl 2016,ipl 9,kings xi punjab,kxip vs srh,kxip vs srh 2016,srh vs kxip,srh vs kxip 2016,sunrisers hyderabad, cricket news, cricket

Warner became the third player from Sunrisers and over-all to get hit-wicket in this ninth edition of IPL.

వెంటాడిన దురదృష్టం.. అయినా ఫ్లే ఆఫ్ లో స్థానం

Posted: 05/16/2016 05:50 PM IST
Warner breaks record then his own stumps

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దురదృష్టకర రీతిలో అవుటయ్యాడు. జాగ్రత్తగా ఆడినప్పటికీ 'హిట్ వికెట్'గా పెవిలియన్ చేరాడు. 180 పరుగుల లక్ష్యాన్ని చేరుకునే బరిలోకి సన్ రైజర్స్ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఎప్పటిలాగానే వార్నర్ విజృభించి ఆడాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 52 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వార్నర్ హిట్ వికెట్ గా వెనుదిరిగాడు.

అక్షర్ పటేట్ వేసిన బంతిని ఆడే క్రమంలో అతడి బ్యాక్ ఫుట్ వికెట్లను తాకడంతో బెయిల్స్ కింద పడ్డాయి. అంపైర్ హిట్ వికెట్ గా ప్రకటించడంతో అతడు నిరాశగా మైదానం వీడాడు. ఈ సీజన్ లో ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు హిట్ వికెట్ అవుట్ కావడం విశేషం. ఇంతకుముందు ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో యువరాజ్ సింగ్ హిట్ వికెట్ గా అవుటయ్యారు. మిచెల్ మెక్లీగన్ బౌలింగ్ లో ఆడబోయి యువీ బ్యాట్ తో వికెట్లను కొట్టాడు. ఐపీఎల్ లో హిట్ వికెట్ గా అవుటైన ఏడో బ్యాట్స్ మన్ వార్నర్ నిలిచాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL-2016  sunrisers hyderabad  david warner  hit wicket  Cricket  

Other Articles