Suresh Raina and wife Priyanka become proud parents of baby girl

Suresh raina becomes father of a baby girl

Suresh Raina,Raina father,Raina daughter,Suresh Raina wife,Raina priyanka,Raina Netherlands,IPL 2016,Gujarat Lions ipl, cricket

Suresh Raina and wife Priyanka have been blessed with a baby girl, the Gujarat Lions skipper, gave the game against RCB a miss to be with his wife in the Netherlands.

సురేష్ రైనా ఇంట ‘లక్ష్మీ’ కటాక్షం..

Posted: 05/16/2016 04:53 PM IST
Suresh raina becomes father of a baby girl

భారత స్టార్ క్రికెటర్, గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేష్ రైనా తండ్రి అయ్యాడు. అతని భార్య ప్రియాంక ఆదివారం సాయంత్రం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సురేష్ రైనా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆమ్‌స్టర్‌డామ్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తన భార్య ప్రియాంక ఆడబిడ్డకు జన్మనిచ్చిందని వెల్లడించాడు. తన పాపకు గ్రాసియా అని పేరు పెట్టినట్లు రైనా స్పష్టం చేశాడు.

'నా అందాల కూతురుకు స్వాగతం. పాప పుట్టే క్రమంలో సుదీర్ఘ నిరీక్షణ భారంగా అన్పించినా..ఇప్పుడు నా సంతోషానికి అవధుల్లేవు'అని రైనా ట్వీట్ చేశాడు. భార్య ప్రసవం కారణంగా ఈనెల10 వ తేదీన నెదర్లాండ్స్ కు వెళ్లిన రైనా.. 143 ఐపీఎల్ మ్యాచ్ల తరువాత ఒక మ్యాచ్ను మిస్సయ్యాడు. గత ఏడాది ఏప్రిల్‌లో తన బాల్య స్నేహితురాలు ప్రియాంకను రైనా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 2016  Suresh Raina  gujarat lions  priyanka  

Other Articles