BCCI paid Rs 2.62 crore to U-19, India 'A' coach Rahul Dravid

Bcci paid rs 2 62 crore to u 19 india a coach rahul dravid

rahul dravid, india coach, india cricket coach, india cricket team, ipl 2016, bcci, delhi daredevils, rahul dravid delhi, bcci, bcci payment, cricket news, cricket

Rahul Dravid was roped in by BCCI for a professional fee of nearly Rs 2.62 crore — half of which was paid to him on April 2.

రిటైర్మెంట్ తరువాత కూడా రాణిస్తున్న రాహుల్ ద్రావిడ్

Posted: 05/13/2016 01:17 PM IST
Bcci paid rs 2 62 crore to u 19 india a coach rahul dravid

టీమిండియా మిస్టర్ వాల్ గా పేరొందిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ క్రికెటర్ గా రిటైర్మెంటు తరువాత కూడా బాగానే రాణిస్తున్నాడు. ఆయన టీమిండియాకు అందించిన విశేష సేవలను పరిగణలోకి తీసుకునే ఇప్పటికీ ఆయన రాణిస్తున్నట్లు తెలుస్తుంది. అదేంటి రిటైర్మెంట్ తరువాత కూడా రాణించడమేంటి..? ద్రావిడ్ మళ్లీ బ్యాట్ పట్టాడా.. అని అనుమానం అక్కర్లేదండి. ప్రస్తుతం అండర్ 19, ఇండియా ఏ జట్టుకు ద్రవిడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

కోచ్ బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు గానూ ద్రవిడ్ అందుకుంటున్న మొత్తం ఎంతో తెలిస్తే అశ్చర్యపోవాల్సిందే. అర్థమైందంటారా..? నిజమే ద్రావిడ్ రాణిస్తున్నది ఆదాయంలోనే.. ఆయన కనబరుస్తున్న జోరు గురించి తెలిస్తే ఔరా.. అనాల్సిందే. బీసీసీఐ ఏడాదికి ద్రవిడ్ కు రూ.2.62 కోట్లు చెల్లిస్తోంది. బోర్డు నుంచి రూ.25 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తం అందుకుంటున్న వారి వివరాలను తమ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ 2న ద్రవిడ్ కు రూ.1.3 కోట్లు చెల్లించినట్లు కూడా పేర్కొన్నారు.

భారత మాజీ ఆటగాడు, లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ క్రికెట్ బోర్డు నుంచి ఇటీవల రూ.90 లక్షలు అందుకున్నాడు. అయితే జనవరి-మార్చి నెలల మధ్య వ్యాఖ్యతగా వ్యవహరించినందుకు పెద్ద మొత్తాన్ని ఆయనకు బోర్డు చెల్లిస్తుంది. గావస్కర్ తర్వాత అంత భారీ మొత్తంలో అందుకున్న వాళ్లలో ద్రవిడ్ ముందున్నాడు. ద్రవిడ్ కోచింగ్ పై నమ్మకం, యువకుల టాలెంట్ ను వెలికి తీయడంలో అతడికి సాటిలేరని భావించిన బీసీసీఐ ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు అంగీకరించి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Dravid  BCCI  Under-19  India A coach  retirement  cricket  

Other Articles