సొట్టబుగ్గల సుందరి, బాలీవుడ్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు సహ యజమానిగా వున్న ప్రితీ జింతా తన జట్టు పేలవ ప్రదర్శనపై మండిపడిందట. పంజాబ్ జట్టుకు ఈ సీజన్ లోనూ ఐపీఎల్ అచ్చిరాలేదు. ఆడిన పది మ్యాచ్‌ల్లో ఏడింటిలో ఓడి.. మూడింటిని మాత్రమే గెలిచింది దీంతో గత ఐపీఎల్ మాదిరిగానే పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలుస్తోంది. ఇక, ఫ్లే ఆఫ్ ఆ జట్టుకు దాదాపు అవకాశాలు లేనట్టే. దీంతో జట్టు యజమానురాలికి మండిపోయిందట.
ఈ నేపథ్యంలో మొహాలిలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్- పంజాబ్ మ్యాచ్ అనంతరం ప్రీతి జింటా జట్టు కోచ్ సంజయ్ బంగర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా ఒక్క పరుగు తేడాతో పంజాబ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. సంజయ్ బంగార్ తన ఇష్టానుసారం బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం.. అక్సర్ పటేల్ కన్నా ముందే ఫర్మాన్ బెహర్దీన్తో పంపించడం ప్రీతికి కోపం తెప్పించిందట. దీంతో జట్టు ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ముందే బంగార్‌ను కోపంలో ప్రీతి అనరాని మాటలు అన్నదని, తిట్టిపోసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు మీడియా కథనాలు వచ్చాయి.
అయితే, ఈ కథనాలపై ప్రీతి జింటా వివరణ ఇచ్చింది. ఈ కథనాలు సత్యదూరమని తోసిపుచ్చింది, ఈ కథనాలు రుజువైతే తాను దీనికైనా సిద్ధమేనని, ఒకవేళ రుజువు కాలేదని తేలితే ఈ కథనాలు రాసిన జర్నలిస్టులు ఏం చేస్తారని ఆమె ప్రశ్నించింది. తాను కోచ్‌పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వచ్చిన కథనాలను ఆమె ఖండించింది. కాగా జట్టు మెరుగైన ప్రదర్శన కోసం తాము చర్చించుకోవడంలో ఏ మాత్రం తప్పులేదని, అంతమాత్రాన తానేదో కోచ్ ను ఇష్టానుసారం తిట్టేసినట్టు కథనాలను ప్రచురించడం సరికాదని అక్షేపించింది,
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more