BCCI to host first day-night Test against New Zealand this year: Anurag Thakur

India will play day night test against new zealand says anurag thakur

Pink Kookaburra Balls, pink ball, India vs New Zealand, Duleep Trophy, Day-Night Test, BCCI, Anurag Thakur

BCCI is all set to host its first-ever day and night cricket Test with pink ball when New Zealand tour India later this year.

డే అండ్ నైట్ టెస్టు మ్యాచులకు బిసిసిఐ సర్వసిద్దం.. కొన్ని మార్పులతో..

Posted: 04/21/2016 08:48 PM IST
India will play day night test against new zealand says anurag thakur

భారత క్రికెట్ అనుసరిస్తున్న ఫోట్టి ఫార్మెట్ క్రికెట్ ను అటకెక్కించాల్సిన సమయం అసన్నమైందని ఒకరు, ఫోట్టి క్రికెట్ ఫార్మెట్ తో ఆటగాళ్లు జాతీయ జట్లకు కాకుండా డబ్బుకే ప్రాముఖ్యతను ఇస్తున్నారని మరోక ప్రపంచస్థాయి దిగ్గజ ఆటగాళ్లు విమర్శలు సాగిస్తున్న తరుణంలో బిసిసిఐ తమ పంథాను మరోమారు స్పష్టం చేసింది. సంప్రదాయ టెస్టు క్రికెట్ ను తాము మరుగున పడేయటం లేదని, అందులోనూ మరిన్ని మార్పులు తీసుకొచ్చేందుకు కూడా తాము నిర్ణయం తీసుకున్నామని బిసిసిఐ స్పష్టం చేసింది.

టెస్టు మ్యాచ్లులలో మార్పులతో డే అండ్ నైట్ మ్యాచ్ల నిర్వహణకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అంగీకారం తెలిపింది. ఈ ఏడాది న్యూజిలాండ్ జట్టు భారత్లో పర్యటన సందర్భంగా డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ను నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ తాజాగా స్పష్టం చేశారు. 'ఈ ఏడాది న్యూజిలాండ్-భారత జట్ల మధ్య టెస్టు సిరీస్లో కచ్చితంగా ఒక డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ను నిర్వహించడానికి సమాయత్తమవుతున్నాం.

అయితే దానికి ముందుగా దులీప్ ట్రోఫీలో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ను నిర్వహిస్తామని తెలిపారు. డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ లు పింక్ బాల్తో జరిగే క్రమంలో ఆ బంతి భారత పిచ్లపై ఎలా పనిచేస్తుందనే పరిశీలించాల్సిన అవసరముంది. పింక్ బాల్ తో భారత స్పిన్నర్లు ఎలా రాణిస్తారు అనేది కూడా ఇందులో ఒక భాగం. ఇందుకు దులీప్ ట్రోఫీనే సరైన వేదిక అనుకుంటున్నాం' అని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

ప్రధానంగా టెస్టుల్లో ఎరుపు రంగు బంతుల్ని వాడే విషయం అందరికీ తెలిసిందే. రాత్రి సమయాల్లో జరిగే మ్యాచ్ ల్లో ఫడ్‌లైట్ల వెలుతురులో ఆడాల్సి ఉంటుంది. అందుకే ఎరుపు కంటే ఇంకా స్పష్టంగా కనిపించేందుకు పింక్ రంగు బంతులని వాడాలని ఐసీసీ నిర్ణయించింది.  గత ఏడాది  యాషెస్ సిరీస్ సందర్భంగా అడిలైడ్ లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ను పింక్ బాల్ తో నిర్వహించారు. పింక్ బంతులు ప్రముఖ సంస్థ కుకుబుర్రా తయారుచేస్తోంది.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles